ఏపీ(AP)లో మూడు ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాల ఉపఎన్నికల (Rajya Sabha Seats)కు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. డిసెంబర్ 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు, మరియు నామినేషన్ల ఉపసంహరణకు గడువు డిసెంబర్ 13 వరకు ఉంటుంది. డిసెంబర్ 20న పోలింగ్ నిర్వహించబడుతుంది, అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.
ఈ స్థానాలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు, మరియు ఆర్. కృష్ణయ్య రాజీనామాల కారణంగా ఖాళీ అయ్యాయి. వీరు రాజీనామా చేయడం ద్వారా వైసీపీ ప్రభుత్వానికి ఈ ఉపఎన్నికలు కీలకంగా మారాయి. ఏపీలో వైసీపీ పార్టీ గడ్డు కాలం ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే చాలామంది వైసీపీ నేతలు సొంతపార్టీని వీడి టిడిపి , జనసేన పార్టీలలో చేరి ప్రజల్లో తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత చాలామంది వైసీపీ ని వీడారు. మాజీ మంత్రులు , ఎంపీలు ఇలా అంత కూడా బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు మూడు రాజ్యసభ స్థానాలకు జరగబోయే ఉప ఎన్నిక అనేది వైసీపీకి కీలకం గా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో పూర్తిగా ఉనికిని కోల్పోయింది. ఈ క్రమంలో వైసీపీ నుండి ఈ ఉప ఎన్నిక కోసం బరిలోకి దిగుతారా లేదా అనేది చూడాలి.
Read Also : International Emmy Awards 2024 : పెళ్లి సమయంలో శోభిత ధూళిపాళ్ల కి భారీ షాక్ తగిలింది