Chandrababu Bail : చంద్రబాబుకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

హైకోర్టు ఇచ్చిన తీర్పు ను ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ దాఖలు చేసింది. చంద్రబాబుకు బెయిల్‌ రద్దు చేయాలని ఏపీ సీఐడీ కోరింది

  • Written By:
  • Publish Date - November 28, 2023 / 03:19 PM IST

స్కిల్ డెవలప్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) కు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ (Chandrababu Bail) మంజూరు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఇచ్చిన తీర్పు ను ఏపీ సీఐడీ సుప్రీంకోర్టు (supreme court)లో సవాల్ చేస్తూ దాఖలు చేసింది. చంద్రబాబుకు బెయిల్‌ రద్దు చేయాలని ఏపీ సీఐడీ కోరింది. అయితే ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపింది. జస్టిస్ బేలా త్రివేది , జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ చేపట్టారు.

తాము సాక్ష్యాధారాలను సమర్పించినా హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ తెలిపింది. దీనిపై విచారించిన న్యాయస్థానం..డిసెంబర్ 08 లోపు కౌంటర్ దాఖలు చేయాలనీ చంద్రబాబుకు నోటీసులు జారీచేసింది. అలాగే తదుపరి విచారణ వరకు కేసు వివరాలు ఎక్కడ మాట్లాడవద్దని, రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆయనకు షరతులు విధించింది. ఈ కేసును డిసెంబర్ 11కి వాయిదా వేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇకపోతే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు రాజమహేంద్రవరం జైలులో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం చంద్రబాబు అనారోగ్యం పాలవ్వడంతో మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం చంద్రబాబుక రెగ్యులర్ బెయిల్ మంజూరు అయ్యింది. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్‌ చేసింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరులో తమ వాదనలు హైకోర్టు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌లో సీఐడీ పేర్కొంది. హైకోర్టు తన పరిధి దాటి తీర్పులో ఏపీ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసిందని సీఐడీ పిటిషన్‌లో ఆరోపించింది. దీని ఫై ఈరోజు సుప్రీం కోర్ట్ విచారణ చేపట్టింది.

Read Also : YCP MLC : మూడో పెళ్లి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్సీ.. సాక్షిగా సంత‌కం చేసిన రెండో భార్య‌

Follow us