Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ తమిళ సినీ నటుడు సత్యరాజ్ తీవ్రంగా స్పందించారు. మతాన్ని ఆధారంగా చేసుకుని తమిళనాడులో రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తే సహించమని హెచ్చరించారు. తమిళ గడ్డపై ఈ తరహా ప్రయత్నాలు ఫలించవని స్పష్టంగా పేర్కొన్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ తమిళనాడులోని మధురైలో జరిగిన “మురుగన్ మానాడు” సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన నాస్తికులు, సెక్యులరిస్టులపై విమర్శలు చేస్తూ, హిందూ ధర్మం, సనాతన విలువలు గురించి మాట్లాడారు. “నాస్తికులకు దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదు. కానీ భారతదేశంలో నాస్తికులు ప్రధానంగా హిందువులనే లక్ష్యంగా ఎంచుకుంటున్నారు” అనే వ్యాఖ్యలు తమిళ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
Nara Lokesh : రెడ్‌బుక్ పేరు వింటే వైసీపీ నేతలకు గుండెపోటు
పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళ సినీ నటుడు సత్యరాజ్ సూటిగా స్పందించారు. “దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోం. తమిళ ప్రజలను మతం పేరుతో మోసం చేయాలనుకోవడం వ్యర్థ ప్రయత్నం” అని ఆయన అన్నారు. సత్యరాజ్ మాట్లాడుతూ.. “పెరియార్ సిద్ధాంతాలను విశ్వసించే తమిళులు చాలా తెలివైనవారు. మురుగన్ సభను మతరంగానికి మలచి మమ్మల్ని మోసం చేస్తామని మీరు అనుకోవడం మీ తెలివితక్కువతనాన్ని చూపుతుంది. దేవుడి పేరు చెప్పి లబ్ధి పొందాలనుకునే ప్రయత్నాలు ఇక్కడ సాగవు” అని పేర్కొన్నారు.
పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే డీఎంకే నేతలు సహా పలువురు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో మతసామరస్యానికి భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సత్యరాజ్ చేసిన గట్టి వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమవుతున్నాయి.
‘Telangana Raising 2047’ : తెలంగాణ రైజింగ్ 2047 అంటే ఏంటి..? ప్రభుత్వ లక్ష్యాలేంటీ..?