Sajjala Bhargav Reddy : సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియా పోస్టులపై ఏపీ ప్రభుత్వం తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనపై కొత్తగా కేసులు నమోదు చేయవద్దని కూడా ఆయన ఆ పిటిషన్ లో కోరారు. భార్గవ్ రెడ్డి తన వాదనలను ఏపీ హైకోర్టులో వినిపించాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. హైకోర్టును ఆశ్రయించే వరకు అంటే రెండు వారాల పాటు అరెస్ట్ చేయకూడదంటూ సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. రెండు వారాల తరువాత మధ్యంతర రక్షణను పొడిగించాలా? లేదా? అనేది హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించింది.
అయితే ఎప్పుడో జరిగిన ఘటనలకు సంబంధించి బీఎన్ఎస్ చట్టాల ప్రకారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారని.. ఇవి చెల్లవని భార్గవ్ రెడ్డి తరపు న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఈ విషయమై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతుందని..ఆయనకు డిసెంబర్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు రక్షణ కల్పించిన విషయాన్ని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్దార్ద్ లూథ్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.
టీడీపీ నేతలపై భార్గవ రెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను .. ధర్మాసనం దృష్టిని తీసుకొచ్చారు. ప్రస్తుత దర్యాప్తునకు కూడా సహకరించడం లేదని వెల్లడించారు. చాలా విషయాలు సుప్రీంకోర్టు ముందు కూడా గోప్యంగా ఉంచారని లూత్రా తెలిపారు. అలాగే సామాజిక మధ్యమాల్లో పెట్టిన పోస్టుల వివరాలను కోర్టుకు ప్రభుత్వం అందించింది. వాటిని పరిశీలించి ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
Read Also: Supreme Court Fire Accident: సుప్రీంకోర్టులో అగ్ని ప్రమాదం? కారణం?