Pawan Kalyan : మావయ్య గెలుపు కోసం రంగంలోకి దిగిన తేజు

ఈరోజు మచిలీపట్నం లో ప్రచారం చేసారు..రేపు మే 5న పిఠాపురం, మే 6న కాకినాడ నియోజకవర్గాల్లో సాయి తేజ్ ప్రచారం చేయబోతున్నారు

Published By: HashtagU Telugu Desk
Teju Janasena

Teju Janasena

మావయ్య గెలుపు కోసం మేన అల్లుళ్లంతా రంగంలోకి దిగారు. ఇప్పటికే వరుణ్ తేజ్ , వైష్ణవ్ తేజ్ ఇప్పటికే జనసేన గెలుపు కోసం ప్రచారం చేయగా..ఈరోజు మెగా హీరో సాయి తేజ్ కూడా రంగంలోకి దిగాడు. ఈసారి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను ఎమ్మెల్యే గా చూడాలని యావత్ తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. గత పదేళ్లుగా ప్రజల కోసం కష్టపడుతూ వస్తున్న ఆయన్ను ..ఈసారి అసెంబ్లీ లో అడుగుపెట్టించి..అధ్యక్ష అని అనిపించేలా చేయాలనీ జనసేన శ్రేణులు, అభిమానులు కష్టపడుతున్నారు. ఇప్పటికే ఆయన గెలుపు ఖాయమని అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ తో చిత్రసీమలో పలువురు పవన్ కోసం ప్రచారం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి పొత్తులో భాగంగా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, బిజెపి తో కలిసి ఎన్నికల బరిలో నిల్చున్నాడు. మొత్తం 21 అసెంబ్లీ , 2 లోక్ సభ స్థానాలకు జనసేన పోటీ చేస్తుంది. వీటిలో పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నారు. గత 15 రోజులుగా పవన్ కళ్యాణ్ రెండు సార్లు ప్రచారం చేయగా..మెగా హీరోలు వరుణ్ తేజ్ , నాగబాబు , వైష్ణవ్ తేజ్ తో పాటు బుల్లితెర నటి నటులు ఇంటింటికి వెళ్లి తమ పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నారు.

వీరే కాదు ఈసారి కూటమి గెలుపు కోసం చాలామంది సినీ ప్రముఖులు రంగంలోకి దిగబోతున్నారని సమాచారం. నేరుగా ప్రచారం చేయకపోయినా..వెనుకాల నుండి వారి సపోర్ట్ తెలియజేస్తూ వస్తున్నారు. అలాగే మెగా స్టార్ చిరంజీవి సైతం ఇప్పటికే కూటమి కి జై కొట్టి అభిమానుల్లో , రాష్ట్ర ప్రజల్లో ఉత్సాహం నింపారు. ఈరోజు సాయి తేజ్ (Sai Dharam Tej) కూడా జనసేన కోసం ప్రచారం మొదలుపెట్టారు. ఈరోజు మచిలీపట్నం లో ప్రచారం చేసారు..రేపు మే 5న పిఠాపురం, మే 6న కాకినాడ నియోజకవర్గాల్లో సాయి తేజ్ ప్రచారం చేయబోతున్నారు.

Read Also : Kishan Reddy : రేవంత్ ‘గాడిద గుడ్డు’ ఫై కిషన్ రెడ్డి ఆగ్రహం

  Last Updated: 04 May 2024, 10:57 PM IST