Rule of law : `స్లీప‌ర్ సెల్‌` ఆప‌రేష‌న్ పై టీడీపీ డౌట్‌! 2004 ఎపిసోడ్ అవ‌లోక‌నం!

స్లీప‌ర్ సెల్స్ ను (Rule of law ) వైసీపీ క్రియేట్ చేసింద‌ని

  • Written By:
  • Updated On - January 4, 2023 / 11:08 AM IST

ఏపీలో రూల్ ఆఫ్ లా (Rule of law) అమ‌లు కావ‌డంలేద‌ని హైకోర్టు రెండేళ్ల క్రిత‌మే చెప్పింది. ఆ మేర‌కు సుప్రీం కోర్టుకు కూడా తెలియ‌చేసింది. అప్ప‌ట్లో డీజీపీగా ఉన్న గౌత‌మ్ స‌వాంగ్ ప‌లుమార్లు హైకోర్టు ఎదుట చివాట్లు తిన్నారు. క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పారు. ప‌లువురు ఐఏఎస్ అధికారులు కూడా హైకోర్టు(high court) మెట్లు తొక్కారు. చేతులు క‌ట్టుకుని నిల‌బ‌డి సంజాయిషీ ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ రూల్ ఆఫ్ లా(Rule of law) ఏపీలో అమ‌లు కావ‌డంలేద‌ని స‌ర్వ‌త్రా వినిపించే మాట‌. అప్ప‌ట్లో హైకోర్టు(high court) న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం కూడా రూల్ ఆఫ్ లా గురించి ఆందోళ‌న చెందింది.

హైకోర్టు రూల్ ఆఫ్ లా గురించి..(Rule of law)

హైకోర్టు ఎన్నో అంశాల‌ను ప‌రిశీలించిన త‌రువాత రూల్ ఆఫ్ లా గురించి ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. తాజాగా రోడ్ షోలు, రోడ్ల‌పై స‌భ‌ల‌ను నిషేధిస్తూ ఇచ్చిన ఉత్వ‌ర్వులు రూల్ ఆఫ్ లా కు వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. భ‌ద్ర‌త క‌ల్పించాల్సిన పోలీసులు చేతులెత్తేస్తూ నిషేధం ఉత్వ‌ర్వులు ఇవ్వ‌డం ప్ర‌భుత్వం చేత‌గానిత‌నాన్ని నిరూపిస్తుంద‌ని విప‌క్ష నేత‌ల ఆరోప‌ణ‌. ఏపీ చ‌రిత్ర‌లో ఎన్నో రోడ్ షోలు, బ‌హిరంగ స‌భ‌లు జ‌రిగాయి. ఇప్ప‌టికీ జ‌రుగుతున్నాయి. కొన్ని సంద‌ర్బాల్లో దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. పార్టీల‌కు అతీతంగా చెప్పుకుంటూ పోతే, తెలంగాణ‌లోని ముదిగొండ వేదిక‌గా రైతుల‌పై పోలీసు కాల్పులు జ‌రిగాయి. ఆ రోజున సీఎంగా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉన్నారు. హైద‌రాబాద్ లోని బ‌షీర్ బాగ్ వేదిక‌గా జ‌రిగిన కాల్పుల్లో ఆందోళ‌న‌కారులు చ‌నిపోయారు. ఆనాడు చంద్ర‌బాబు ఉమ్మ‌డి సీఎంగా ఉన్నారు. ఇలా ఎన్నో సంఘ‌ట‌న‌లు ఆయా పార్టీలు అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌రిగాయని ఏపీ రాజ‌కీయ చ‌రిత్ర చెబుతోంది.

ప్ర‌జాస్వామ్యానికి భంగం క‌లిగేలా..(high  court)

ఏపీ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేనివిధంగా రోడ్ షోలు, బ‌హిరంగ స‌భ‌ల్ని నిషేధిస్తూ ఉత్త‌ర్వులు ఇవ్వ‌లేదు. ఈసారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హ‌యాంలో మాత్ర‌మే ఇలాంటి ఉత్త‌ర్వులు వెలువ‌డ‌డం విప‌క్షాల‌ను ఆగ్ర‌హానికి గురిచేస్తోంది. సాధార‌ణంగా అధికారంలో ఉన్న ప్ర‌భుత్వం భ‌ద్ర‌త‌ను క‌ల్పించాలి. ఎలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ శాంతి భ‌ద్ర‌త‌ల‌ను ప‌గడ్బందీగా నిర్వ‌హించాలి. నిఘా సంస్థ‌లు ఆ మేర‌కు బ‌లంగా ప‌నిచేయాలి. లేదంటే ఆ ప్ర‌భుత్వం వైఫ‌ల్యం చెందిన‌ట్టుగా భావించాలి. ఇదే విష‌యాన్ని విప‌క్ష నేత‌లు చెప్ప‌డ‌మే కాదు, రాజ్యాంగం చెబుతోన్న ప్ర‌కారం పౌర హ‌క్కులు, ప్ర‌జాస్వామ్యానికి భంగం క‌లిగేలా నిర్ణ‌యాలు ఉండ‌కూడ‌దు. కేవ‌లం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం స‌భ‌లు, రోడ్ షోల‌ను నిర్వ‌హించుకుంటూ విప‌క్షాల‌కు ఆ అవ‌కాశం లేకుండా చేయ‌డం ఏమిటి? ఆ ఉత్త‌ర్వుల‌ను ఎలా ఇచ్చారంటూ పోలీసుల‌ను విప‌క్ష నేత‌లు నిల‌దీస్తున్నారు.

Also Read : AP Emergency : జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి `జ‌న` భ‌యం! చంద్ర‌బాబు స‌భ‌ల‌తో వ‌ణుకు!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌భ‌ల్లో జ‌రిగిన దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న వెనుక ఏమి జ‌రిగిందో పోలీసులు తెలుసుకోవాలి. అలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాలి. అందుకు భిన్నంగా అధికార ప‌క్షం నేత‌లు చంద్ర‌బాబు స‌భ‌ల విజ‌య‌వంతంపై దుమ్మెత్తిపోస్తున్నారు. జ‌న‌సందోహాన్ని ఎవ‌రూ దాచిపెట్ట‌లేరు. ఆ మేర‌కు పోలీసులు ముందుగా భ‌ద్రతా ఏర్పాట్లు చేయాలి. అదేం లేకుండా చంద్ర‌బాబు ఉద్దేశ‌పూర్వ‌కంగా తొక్కిస‌లాట‌కు ప్లాన్ చేస్తున్నార‌ని ఆరోప‌ణ‌ల‌కు దిగ‌డం దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు ప‌రాకాష్ట‌. నెల్లూరు జిల్లా కందుకూరు వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట ఎనిమిది మందిని పొట్టున పెట్టుకుంది. ఆ రోజున జ‌రిగిన తొక్కిస‌లాట ప్రాంతాన్ని ప‌రిశీలిస్తే కొన్ని అనుమానాల‌ను రేకెత్తించింది. ఒక రోజు వ్య‌వ‌ధిలోనే గుంటూరు వికాస్ న‌గ‌ర్ వేదిక‌గా జ‌రిగిన తొక్కిస‌లాట మ‌రిన్ని అనుమానాల‌కు తావిస్తోంది. స్లీప‌ర్ సెల్స్ రూపంలో చంద్ర‌బాబు స‌భ‌కు కొంద‌రు వైసీపీ కార్య‌క‌ర్త‌లు జొర‌బ‌డి తొక్కిస‌లాట‌ను క్రియేట్ చేస్తున్నార‌ని టీడీపీ అనుమానిస్తోంది. ఆ మేర‌కు రాజ‌కీయ పోస్ట్ మార్టం జ‌రుగుతోంది.

Also Read : Chandrababu Road Show : చంద్ర‌బాబు రోడ్ షో సూప‌ర్ హిట్ ! ఏలూరులో జ‌న‌ప్ర‌భంజ‌నం!!

స్లీప‌ర్ సెల్స్ ను వైసీపీ క్రియేట్ చేసింద‌ని టీడీపీ అనుమానించ‌డం వెనుక పూర్వ‌పు అనుభ‌వాలు ఆ పార్టీకి ఉన్నాయి. 2004 ఎన్నిక‌ల సంద‌ర్భంగా చంద్ర‌బాబును అధికారం నుంచి దింప‌డానికి స్లీప‌ర్ సెల్స్ ను ఉప‌యోగించార‌ని అప్ప‌ట్లో టీడీపీ ఆల‌స్యంగా గుర్తించింది. ఆ ఎన్నిక‌ల్లో న‌క్స‌లిజానికి వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు మేనిఫెస్టో పెట్టారు. దీంతో న‌క్స‌ల్స్ అంద‌రూ టీడీపీని బాహాటంగా వ్య‌తిరేకించారు. ఆ టైమ్ లో వంద‌లాది మంది గ్రామ స్థాయి లీడ‌ర్ల‌ను టీడీపీ కోల్పోయింది. ఎన్నిక‌ల స‌మ‌యానికి ప్ర‌చారం చేయ‌డానికి కూడా బ‌య‌ట‌కు రానంతంగా టీడీపీ లీడ‌ర్ల‌కు భ‌యాన‌క వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఆ ఎన్నిక‌ల్లో న‌క్స‌ల్స్ ను ప్ర‌భుత్వం అదుపు చేయ‌లేక‌పోయింది. కార‌ణం, న‌క్స‌ల్స్ తో ఫ్యాక్ష‌నిస్ట్ లు చేయి క‌ల‌పార‌ని నిఘా వ‌ర్గాల‌కు ఆల‌స్యంగా స‌మాచారం అందింద‌ట‌. కాంగ్రెస్ కు చెందిన ఫ్యాక్ష‌నిస్ట్ లు న‌ల్ల‌మ‌ల అట‌విని ఆనుకుని ఉన్న సుమారు 80 అసెంబ్లీ నియోజ‌క‌వర్గాల్లో న‌క్స‌ల్స్ తో చేయి క‌లిపార‌ని ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత టీడీపీ ఆల‌స్యంగా గ్ర‌హించింది. ఫ‌లితంగా 2004 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు అధికారాన్ని కోల్పోయార‌ని ఇప్ప‌టికీ చెబుతోంది.

జ‌గ‌న్ సైన్యంలోని కొంద‌రు స్లీప‌ర్ సెల్స్ గా..

ప్ర‌స్తుతం చంద్ర‌బాబు స‌భ‌ల‌కు వ‌స్తోన్న ఆద‌ర‌ణ‌ను అడ్డుకోవ‌డానికి స్లీప‌ర్ సెల్స్ ను వైసీపీ త‌యారు చేసింద‌ని టీడీపీ విశ్వ‌సిస్తోంది. వాటి కార‌ణంగా కందుకూరు, గుంటూరు తొక్కిస‌లాట జ‌రిగింద‌ని భావిస్తోంది. పోలీసులు తగిన భ‌ద్ర‌త ఏర్పాట్లు కొంత మేర‌కు చేస్తున్న‌ప్ప‌టికీ మునుపెన్న‌డూ లేని విధంగా చంద్ర‌బాబు స‌భ‌ల్లో వ‌రుస‌గా తొక్కిస‌లాటలు జ‌ర‌గ‌డం కేస్ స్ట‌డీగా మారింది. ఆయ‌న గ‌త 40 ఏళ్లుగా కొన్ని వేల స‌భ‌ల‌ను నిర్వ‌హించారు. పెద్ద సంఖ్య‌లో జ‌నం వ‌చ్చిన స‌భలు అనేకం ఉన్నాయి. కానీ, ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడే ఎందుకు తొక్కిస‌లాట జ‌రుగుతుంది? అని టీడీపీ ఆరా తీసింది. పైగా తొక్కిస‌లాట జ‌రిగిన వెంట‌నే మంత్రులు ప‌రామ‌ర్శ‌కు రావ‌డం, సొంత ఛాన‌ల్ లో వీడియోల‌ను ప్ర‌ద‌ర్శించ‌డం, స్కోల్రింగ్ లు వేయ‌డం త‌దిత‌ర అంశాల‌ను సీరియ‌స్ గా తీసుకుంటోంది. కేవ‌లం స్లీప‌ర్ సెల్స్ కార‌ణంగా మాత్ర‌మే తొక్కిస‌లాట జ‌రిగింద‌ని టీడీపీ నిర్థార‌ణ‌కు వ‌స్తోంది. 2004 ఎన్నిక‌లప్పుడు వైఎస్ అనుచ‌ర‌గ‌ణం ఏ విధంగా న‌క్స‌ల్స్ తో చేతులు క‌లిపిందో, ఇప్పుడు జ‌గ‌న్ సైన్యంలోని కొంద‌రు స్లీప‌ర్ సెల్స్ గా ఏర్పడి చంద్ర‌బాబు స‌భ‌లు పెట్ట‌కుండా తొక్కిస‌లాటకు ప్లాన్ చేశార‌ని అనుమానిస్తోంది.

Also Read : Nellore Postmortem : చంద్ర‌బాబు స‌భపై పోస్ట్ మార్టం! తొక్కిసలాటపై రాజ‌కీయం!!

విప‌క్షాల‌కు ఉన్న అనుమానాల‌ను నివృత్తి చేయాల్సిన బాధ్య‌త పోలీసుల‌పై ఉంది. ఆ దిశ‌గా ఆలోచించ‌కుండా చంద్ర‌బాబు మీద కేసు పెట్టాల‌ని కొంద‌రు వైసీపీ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. ఆ మేర‌కు ఫిర్యాదులు కూడా చేయ‌డం కూడా జ‌రిగింది. అంతేకాదు, రోడ్ షోలు, బ‌హిరంగ స‌భ‌ల‌ను నిషేధిస్తూ వివాద‌స్ప‌ద నిర్ణ‌యాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ తీసుకుంది. స‌రిగ్గా ఇక్క‌డే, ఏపీలోని రూల్ ఆఫ్ లా గురించి న్యాయ‌వాదులు ప్ర‌శ్నిస్తున్నారు. ఆనాడు హైకోర్టు(high court) న్యాయ‌మూర్తులు రాత‌పూర్వ‌కంగా ఏపీలోని రూల్ ఆఫ్ లా(Rule of law) నుంచి ప్ర‌శ్నిస్తూ సుప్రీం కు తెలియ‌చేసిన విధంగా తాజా ప‌రిణామాలు ఉండ‌డం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశం అయింది.