BPCL Oil Refinery: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరో భారీ ప్రాజెక్టు దక్కింది. నెల్లూరు జిల్లా రామాయపట్నంలో దాదాపు రూ.60వేల కోట్లతో ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ హబ్‌ను భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఏర్పాటు చేయబోతోంది. దీనిపై ఈ నెలాఖరులో (నవంబర్ 29న ) అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం -2014లో కూడా ప్రస్తావించారు. ఎట్టకేలకు ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(BPCL Oil Refinery) చొరవతో ఆంధ్రప్రదేశ్‌లో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. దీనివల్ల రాష్ట్ర యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Also Read :Engineering Colleges : 40 ఇంజినీరింగ్ కాలేజీలకు ‘అటానమస్’.. తెలంగాణ సర్కారు విచారణ ?
వాస్తవానికి బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ హబ్ కోసం తొలుత మచిలీపట్నం పేరును పరిశీలించారు. అది ఏపీ రాజధానికి దగ్గరగా ఉండటం, పోర్టు కూడా అందుబాటులో ఉండటం అడ్వాంటేజీ అని బీపీసీఎల్ ఉన్నతాధికారుల టీమ్ భావించింది. అయితే చివరకు ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. తదుపరిగా శ్రీకాకుళం పేరు పరిశీలనకు వచ్చింది. కానీ అది కూడాా ఫైనల్ కాలేదు. బీపీసీఎల్ ప్రతినిధులు ఈ ఏడాది జులైలో చంద్రబాబుతో సమావేశమైనప్పుడు మచిలీపట్నం, శ్రీకాకుళం, రామాయపట్నం పేర్లను ప్రతిపాదించారు. ఎట్టకేలకు ఇప్పుడు ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం రామాయపట్నంను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రామాయపట్నంలో దాదాపు వెయ్యి ఎకరాల్లో రిఫైనరీ, పెట్రోకెమికల్ హబ్‌ను బీపీసీఎల్ ఏర్పాటు చేయనుంది.
Also Read :Arrest Warrants On Adani : గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై అమెరికాలో కేసు.. అరెస్టు వారెంట్ జారీ ?
రూ.40వేల కోట్ల పెట్టుబడితో టాటా పవర్ సోలార్ విద్యుత్, పవన్ విద్యుత్ ప్రాజెక్ట్‌లు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానున్నాయి. అంటే విద్యుత్, రిఫైనరీ రంగాల కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయి. దీనికి కారణం ఏపీకి ఉన్న విశాలమైన కోస్తా తీరం. రాష్ట్రంలో ఉన్న జలవనరుల లభ్యత. ఈ రెండింటిని అనుకూలంగా మలుచుకొని ఏపీలో రాణించవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోకి ఆయా రంగాల కంపెనీలకు ఆహ్వానం పలుకుతోంది. తద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భావిస్తోంది.