Floods In Vijayawada : వరద బాధితులకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) గుడ్ న్యూస్ అందించారు. విజయవాడ (Vijayawada )లో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి రూ.25వేలు, ఫస్ట్, ఇతర ఫ్లోర్లు మునిగిన వారికి 10,000 చొప్పున సాయం చేస్తామని ప్రకటించారు. కిరాణా షాపులు, ఇతర చిన్న దుకాణాలు మునిగిన వారికి రూ.25వేలు ఇస్తామన్నారు. మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ ..ఈ నెల 20వ తేదీతో వరదలు వచ్చి 10రోజులు అయ్యిందని, ప్రతిరోజు ఏదో ఒక ఇబ్బంది ఉందని , దీనికితోడు వైసీపీ రంగులున్న బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొట్టయని అన్నారు. దీంతో బ్యారేజీ గేట్లు రిపేరు చేయించామని పేర్కొన్నారు. 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే సమయంలో బోట్లు వదిలారని వైసీపీ ఫై మండిపడ్డారు. సాధారణ స్థితికి రావడానికి పది రోజులు పట్టిందని, గత ప్రభుత్వం ఉండి ఉంటే ఆరు నెలలైనా సరిపోయేది కాదన్నారు.
మంత్రులు నిమ్మల రామానాయుడు, నారాయణ, హంమంత్రి వంగలపూడి అనిత అదరూ అక్కడే ఉండి సహయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారని తెలిపారు. ఇన్ని ప్రయత్నాలు చేశాక కూడా మామూలు స్ధితికి రావడానికి 10రోజులు పట్టిందని వివరించారు. కృష్ణానదికి వరద వస్తే అమరావతి మునిగిపోతుందంటూ YCP దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘విశాఖలో హుద్ హుద్ రాలేదా? కర్నూలు, తిరుపతి, నెల్లూరు నగరాలు వరదల్లో మునగలేదా? వరద వస్తే ఏ ప్రాంతమైనా మునగాల్సిందే. అలా అయితే చెన్నై, బెంగళూరు, ముంబై నగరాలనూ మార్చాల్సి వస్తుంది. బుద్ధి, జ్ఞానం ఉన్నవాళ్లెవరూ ఇలా మాట్లాడరు. అమరావతిపై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోం’ అని హెచ్చరించారు.
Read Also : Jani Master: జానీ మాస్టర్‌కు మరో షాక్.. డ్యాన్స్ అసోసియేషన్ నుంచి తొలగింపు