Site icon HashtagU Telugu

Chandrababu: రూ.200, రూ.500 నోట్లను కూడా రద్దు చేయాలిః చంద్రబాబు

Rs.200 and Rs.500 notes should also be abolished: Chandrababu

Rs.200 and Rs.500 notes should also be abolished: Chandrababu

 

 

Chandrababu: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఓట్లు చీలవద్దనే ఉద్దేశంతో ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్నామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandrababu) తెలిపారు. పొత్తుల వల్ల కొంతమంది నేతలకు టికెట్ ఇవ్వలేకపోయానని చెప్పారు. టీడీపీ(tdp) కోసం పనిచేసిన 31 మంది నేతలకు టికెట్ ఇవ్వడం సాధ్యం కాలేదన్నారు. అయితే, పార్టీకి వారు చేసిన సేవలను తాను మర్చిపోలేదని, ఇకపైనా మర్చిపోబోనని స్పష్టం చేశారు. మూడు పార్టీల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్లు ఉన్నారని చెప్పారు. పొత్తుల కారణంగా అందరికీ టికెట్ ఇవ్వడం సాధ్యం కాలేదని వివరించారు. పొత్తులతో సంబంధం లేకుండా కొందరి సీనియర్లకు కూడా టిక్కెట్లు ఇవ్వలేకపోయామని చెప్పారు. ఈ మూడు పార్టీల నేతల త్యాగాల పునాది రాష్ట్ర భవిష్యత్తుకు ఊతమిచ్చేలా ఉండాలని ఆకాక్షించారు.

We’re now on WhatsApp. Click to Join.

రాగద్వేషాలకు, రికమెండేషన్లకు అతీతంగా విజయావకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసినట్లు చంద్రబాబు తెలిపారు. పార్టీ పరంగానే కాకుండా సొంతంగా ఓట్లేయించుకునే వారిని, నిలబెట్టిన అభ్యర్థులు గెలిచేలా బేరీజు వేసుకునే మూడు పార్టీల అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని వివరించారు. టికెట్ దక్కని నేతల త్యాగాన్ని పార్టీ గుర్తుంచుకుంటుందని, ప్రభుత్వం ఏర్పడ్డాక వారికి తగిన న్యాయం చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. సేవా భావంతో ఉన్న వాళ్లని రాజకీయాల్లో ప్రొత్సహించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు. వివిధ రంగాల్లో స్థిరపడిన వారికి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కలుగుతోందని, రాజకీయాలను ఇంకా ప్రక్షాళన చేయగలిగితే.. మరింత మంది మంచి వారు ప్రజాసేవకు ముందుకు వస్తారని పేర్కొన్నారు.

Read Also:Sovereign Gold Bond : లక్ష పెడితే రెండున్నర లక్షలు.. కాసులు కురిపిస్తున్న ‘గోల్డ్ బాండ్లు’!

రాజకీయాలను జగన్ వ్యాపారం చేశాడని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ లాంటి సీఎంను తాను ఎక్కడా చూడలేదన్నారు. ఆయన నోరు తెరిస్తే అబద్ధాలే అని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తారని ఆరోపించారు. ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని చంద్రబాబు మండిపడ్డారు. పురంధేశ్వరిపై, పవన్ కల్యాణ్ పై, జనసేన పార్టీపై.. అందరిపైనా తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also:Siddaramaiah : మా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఆఫర్‌ చేశారు.. సిద్ధరామయ్య ఆరోపణలు

దేశంలో పెద్ద నోట్లు రద్దు కావాలనేది తన ఆలోచన అని, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ వంటి పార్టీని కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలని అభిప్రాయపడ్డారు. రూ.200, రూ.500 నోట్లను కూడా రద్దు చేసే పరిస్థితి రావాలని అన్నారు. రాష్ట్ర సంపదనంతా హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. తమ అక్రమాలను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి విస్తరించారని చంద్రబాబు తెలిపారు. జగన్ రాజకీయాన్ని వ్యాపారం చేశారని విమర్శించారు. అసలు, జగన్ వంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని అన్నారు. జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతుంటాడని ధ్వజమెత్తారు.