అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా సింహాచలం స్టేషన్ (Simhachalam Railway Station) అభివృద్ధి పనులకు శనివారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnav) శంకుస్థాపన చేసారు. దాదాపు రూ.20 కోట్ల (RS 20 cr)తో రైల్వే శాఖ సింహాచలం స్టేషన్ అభివృద్ధి పనులను చేయనుంది. ఈ సందర్బంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ.. విజయనగరం జిల్లా కంటకాపల్లి రైల్వే ప్రమాదం మానవ తప్పిదం వల్లే జరిగిందని, ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
‘త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్ళు పట్టాలెక్కనున్నాయి. వారానికి ఒక వందే భారత్ రైలు నిర్మాణం జరుగుతోంది. రైల్వేలను రాజకీయాలతో ముడిపెట్టి చూడొద్దు. ఏపీలో రైల్వేల అభివృద్ధి కోసం 8వేల 406కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. భూ కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. దేశంలో 5జీ మొబైల్ సర్వీసుల విస్తరణ చాలా వేగంగా జరుగుతోంది. దీపావళి నాటికి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. నాలుగువేల నూతన సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటవుతున్నాయి. ఇందులో ఎక్కువ ఉత్తరాంధ్రలోనే నిర్మాణం జరుగుతున్నాయి’ అని అశ్వినీ వైష్ణవ్ చెప్పుకొచ్చారు.
Read Also : Auto Drivers : తెలంగాణ కాంగ్రెస్ కు మొదటి షాక్ తగలబోతుందా..?