Sathya Sai Centenary : పుట్టపర్తి సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాల వేళ ఆయన స్మారకార్ధం రూ.100 నాణేన్ని విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఏప్రిల్ 22న కేంద్ర ఆర్థిక శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నాణెం 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో 35 గ్రాముల బరువుతో ఉంటుంది. ఈ నాణెంలో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ ఉంటాయి. నాణెంలో ఒకవైపు అశోక స్తంభం, మరోవైపు సత్య సాయిబాబా ఫొటో, 1926 నంబర్ ఉంటాయి. సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాలు(Sathya Sai Centenary) నవంబర్ 23 నాటికి పూర్తవుతాయి.
Also Read :Terrorist Attacks : కశ్మీరులో ఉగ్రదాడి.. పాక్ ఆర్మీ చీఫ్ కుట్ర.. కారణం అదే !
1926 నవంబర్ 23న జననం
సత్యసాయి బాబా గొప్ప ఆధ్యాత్మిక వేత్త. ఆయన మానవతావాది. మతాల ఐక్యత, నిస్వార్థ సేవకు సత్యసాయి బాబా పెట్టింది పేరు. ఆయన 1926 నవంబర్ 23న పుట్టపర్తిలో ఈశ్వరమ్మ,పెద్దవెంకమ రాజు రత్నాకరం దంపతులకు జన్మించారు. బాబా పూర్తి పేరు సత్య నారాయణ రాజు. చిన్న నాటి నుంచి సాయికి ఆధ్యాత్మిక అంటే చాలా ఇష్టం. “అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చేయు” అనే గొప్ప సందేశంతో బాబా జీవించారు. లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. అనేక ఆసుపత్రులు, పాఠశాలలు, నీటి ప్రాజెక్టులను సత్యసాయి బాబా స్థాపించారు. సత్యసాయి బాబాను షిరిడీ సాయి బాబా పునర్జన్మ అని విశ్వసిస్తారు.
Also Read :Surgical Strike : మోడీ సీరియస్.. పాక్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా ?
నల్లని తేలు కుట్టడంతో..
సత్యసాయికి చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికత అంటే ఇష్టం. అందువల్ల భక్తి సంగీతం, నృత్యం, నాటకాలపై ఎక్కువగా ఆసక్తి చూపేవారు. సత్య సాయి ఎక్కువగా పూజలు చేసేందుకు ఇష్టపడేవారు. 14 ఏళ్ల వయసులో సత్యసాయి.. పుట్టపర్తికి సమీపంలోని ఉరవకొండలో నివసించేవారు. 1940 సంవత్సరం మార్చి 8న అనుకోకుండా ఓ సంఘటన జరిగింది. సాయి బాబాకు ఓ నల్లని తేలు కుట్టింది. దీంతో ఆయన గంటపాటు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన ప్రవర్తనలో మార్పు కూడా వచ్చింది. వాక్చాతుర్యం సైతం పెరిగింది. సత్యసాయి సంస్కృత శ్లోకాలు పాడటం మొదలుపెట్టారు. ఆయనలో ఇంకా చాలా రకాల మార్పులు కూడా వచ్చాయి. 1940లో మే 23 నుంచి సత్యసాయి బాబాకు ఆయన తల్లి పూల దండను, ప్రసాదాన్ని సమర్పించేది. సత్యసాయి బాబాకు 1963లో గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన పక్షవాతానికి గురయ్యారు. తదుపరిగా వీల్ ఛైర్‌కే పరిమితమయ్యారు. చివరకు 84 సంవత్సరాల వయసులో 2011 ఏప్రిల్ 24న సత్యసాయిబాబా కన్నుమూశారు.