అన్నమయ్య జిల్లా(Annamayya District)లోని ఓబులవారిపల్లి మండలం గుండాలకోన సమీపంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మహాశివరాత్రి (Shivaratri) సందర్భంగా వై.కోట నుంచి భక్తులు ఆలయ దర్శనానికి వెళ్తుండగా, మార్గమధ్యంలో ఏనుగుల గుంపు వారిపై ఆకస్మికంగా దాడి (Elephants Attack) చేసాయి. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన ఆలయ పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
MLC Elections : ఎమ్మెల్సీ బరిలో జనసేన
ఈ దుర్ఘటనపై అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే అటవీశాఖ అధికారులు, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చనిపోయిన వారిని ఉర్లగడ్డ పోడు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఏనుగుల దాడులు తరచుగా జరుగుతున్నప్పటికీ, ఇప్పటి వరకు సమర్థమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
MLC Elections : నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. పోలింగ్ ఏర్పాట్లు ఇలా..!
ఈ ఘటనపై డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalayan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షల పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీధర్‌కు బాధిత కుటుంబాలను పరామర్శించి, సంఘటనపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అటవీశాఖ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ స్పష్టంగా తెలిపారు.