Jana Sena Symbol : జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్‌..

  • Written By:
  • Publish Date - February 7, 2024 / 02:33 PM IST

జనసేన (Janasena) పార్టీ కి భారీ షాక్ తగిలింది..పార్టీ కి కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును (Glass Tumbler Symbol) రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టు లో RPC పార్టీ పిటిషన్‌ వేసింది. దీనిపై కోర్ట్ విచారణ జరపనుంది. రీసెంట్ గా జనసేనకు గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఇ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇక టీడీపీ – జనసేన పార్టీలు పొత్తు తో బరిలోకి దిగబోతున్నాయి. ఈ క్రమంలో ఇరు పార్టీలు అభ్యర్థుల ఎంపిక , ప్రచారం తదితర అంశాలఫై చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో.రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ (RPC ) జనసేన కు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

గాజు గ్లాస్‌ గుర్తు కేటాయించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని, గతేడాది మే 13న గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్‌గా ఈసీ ప్రకటించిందని గుర్తు చేశారు. గాజు గ్లాసు గుర్తు తమకు కేటాయించాలని ఈసీకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ దరఖాస్తు చేసుకుంది. ఈసీతో సంప్రదింపులు చేస్తున్న సమయంలో గాజు గ్లాసును జనసేనకు కేటాయించారని పిటిషనర్‌ పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల సంఘాలు, జనసేన పార్టీని చేర్చారు. మరి దీనిపై కోర్ట్ తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తి గా మారింది.

Read Also : Jasprit Bumrah: ఐసీసీ ర్యాంకింగ్స్ లో సత్తాచాటిన జస్పీత్ బుమ్రా.. నంబ‌ర్ వ‌న్ స్థానం కైవ‌సం..!