Site icon HashtagU Telugu

Minister Roja Photographer : తిరుమలలో మంత్రి రోజా అనుచరుడు అన్యమత ప్రచారం..!

minister roja photographer violated the rules in tirumala

minister roja photographer violated the rules in tirumala

ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల (Tirumala) ఇటీవల వరుస వివాదాలతో నిలుస్తుంది. ముఖ్యంగా తిరుమలలో అన్యమత ప్రచారం ఎక్కువ అవుతుందని భక్తులు వాపోతుండగా..తాజాగా మంత్రి రోజా (YCP Minister Roja) ఫొటోగ్రాఫర్‌ టీటీడీ (TTD) నిబంధనలకు విరుద్ధంగా అన్యమత శిలువ గుర్తుతో ఆలయంలోకి రావడం తో ఇప్పుడు చర్చ కు దారితీసింది. వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకునేందుకు మంత్రి రోజా వచ్చారు. ఆమెతో పాటు తన వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌ను కూడా తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్‌ స్టెయిన్‌ అన్యమత గుర్తు ఉన్న గొలుసుతో గొల్లమండపం ఎక్కారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తిరుమలలో అన్యమత గుర్తులు, రాజకీయ గుర్తులు, జెండాలు తిరుమలకు తీసుకుని రావొద్దని నిషేధం ఉన్నప్పటికి సాక్షాత్తూ మంత్రి పర్సనల్ ఫోటో గ్రాఫర్ షేన్ అన్యమత గుర్తు కలిగిన చైన్‌తో తిరుమలలో తిరుగుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై టీటీడీ విజిలెన్స్ సిబ్బంది స్పందించి చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. గతంలో కూడా పార్టీలకు సంబంధించిన జెండాలు కలకలంరేపాయి. తాజాగా మంత్రి ఫోటోగ్రాఫర్ ఇలా శిలువ గుర్తుతో కనిపించడం చర్చనీయాంశమైంది.

Read Also : BC Atma Gourava Sabha : ఈ నెల 07 న హైదరాబాద్ లో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ..