Tirumala : మంత్రి రోజా హల్ చల్…50మంది అనుచరులతో బ్రేక్ దర్శనం..!!

తిరుమలలో కొందరు ఏపీ మంత్రులు వ్యవహరిస్తున్న తీరు భక్తులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.

  • Written By:
  • Updated On - August 18, 2022 / 07:23 PM IST

తిరుమలలో కొందరు ఏపీ మంత్రులు వ్యవహరిస్తున్న తీరు భక్తులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో సర్వదర్శనానికి 30గంటల సమయం పడుతుంది. కాగా కొందరు మంత్రులు భారీ సంఖ్యలో అనుచరగణంతో వచ్చి బ్రేక్ దర్శనాలు చేస్తున్నారు. దీంతో సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇక ఈనెల 21 వ తేదీవరకు అన్ని బ్రేక్ దర్శనాలను టీటీడీ నిలిపివేస్తంది. వీఐపీ సిఫార్సులను కూడా రద్దు చేసింది. ఈ నిబంధనలను పక్కన పెట్టారు మంత్రి రోజా. ఇవాళ 50 మంది అనుచరులకు బ్రేక్ దర్శనం చేయించారు. దీంతో గంటకు పైగా భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రోజా తీరుపై భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ అధికారులపై ఒత్తిడి తెచ్చి దర్శనం చేయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యే మంత్రి ఉషాశ్రీ చరణ్ కూడా ఈవిధంగానే వ్యవహరించి విమర్శలపాలు అయిన విషయం తెలిసిందే.