AP : తెలంగాణలో పోరాటం చేస్తానన్న షర్మిల.. ఇప్పుడు ఏపీకి ఎందుకు వచ్చింది.? – మంత్రి రోజా

  • Written By:
  • Publish Date - February 9, 2024 / 03:51 PM IST

ఏపీలో షర్మిల (Sharmila) అడుగుపెట్టడం అధికార పార్టీ వైసీపీ (YCP) కి చెమటలు పట్టిస్తుంది. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టడం ఆలస్యం..షర్మిల అధికార పార్టీ వైసీపీ ఫై దూకుడు కనపరుస్తున్నారు. వరుస పెట్టి ప్రశ్నలు సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎప్పటిలాగేనే ప్రతి పక్ష పార్టీల ప్రశ్నలకు సమాదానాలు చెప్పని అధికార పార్టీ నేతలు..వ్యక్తిగత దాడులకు దిగడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు షర్మిల విషయంలోనూ అలాగే చేస్తున్నారు.

తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్ ,మంత్రి రోజా (Roja) షర్మిల ఫై ఘాటు వ్యాఖ్యలే చేసింది. 2024 ఎన్నికల తర్వాత నాన్ లోకల్‌ పొలిటీషియన్‌లు చంద్రబాబు.. పవన్.. లోకేష్.. షర్మిల తెలంగాణ కు పారిపోవడం ఖాయం..జగన్ సింహంలా మ్యానిఫెస్టోతో సిద్దంగా వుంటే ప్రతి పక్ష పార్టీలు ఇంకా సిద్దంగా లేరని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో వార్ వన్ సైడ్‌.. మళ్లీ జగన్‌ సీఎం కావడం ఖాయమ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒక సారి గమనించాలని, జగన్ని జైలు పాలు చేసిన పార్టీతో చేతులు కల్పి అన్యాయం చేశారన్నారు. షర్మిలకి సలహా ఇస్తున్నానని, ఇప్పుడు తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి నుంచి మనకి రావాల్సిన 6 వేల కోట్లు అని, ఉమ్మడి ఆంధ్ర హయాంలో ఏపీకి రావాల్సిన లక్ష 80 కోట్ల ఆస్తులు రాబ‌ట్టాలన్నారు. టూర్ లు పెట్టి ప్రచారం చేస్తున్నారని, తెలంగాణలో పోరాటం చేస్తా అని చెప్పి కాంగ్రెస్ లో విలీనం ఎందుకు చేసిందో షర్మిల చెప్పాలని మంత్రి రోజా ప్ర‌శ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీలో ఏ లబ్ది పొందడానికి కాంగ్రెస్ తరుపున ప్రచారం చేస్తున్నారో షర్మిల చెప్పాలని, రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే కాంగ్రెస్ మీద ఉమ్మేసి వాళ్ళు అని చెప్పి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్ లో మళ్ళీ జాయిన్ అయ్యారో చెప్పాలని మంత్రి రోజా నిల‌దీశారు. గట్స్‌ ఉన్న నాయకుడు జ‌గ‌న్‌. చంద్రబాబు, లోకేశ్‌, టీడీపీని జాకీలు పెట్టి లేపినా జాకీలు విరిగిపోతున్నాయి. వయసులో చిన్నవాడైన అమిత్ షా కాళ్ల‌ను చంద్ర‌బాబు పట్టుకోవడం సిగ్గుచేటు అన్నారు. బాబు మా చిత్తూరు జిల్లాలో పుట్టడం అంత‌క‌న్నా సిగ్గుచేటు అని మంత్రి దుయ్య‌బ‌ట్టారు. అధికారంలోకి రావాలన్న కాంక్షతో కాంగ్రెస్‌తో ఒకసారి, బీజేపీతో ఇంకోసారి పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పొలిటికల్‌గా రోజురోజుకు చంద్ర‌బాబు దిగజారిపోతున్నారని ధ్వ‌జ‌మెత్తారు.

Read Also : Bharat Ratna to PV : పీవీకి భారతరత్న.. చిరంజీవి, సోనియా ఫుల్ హ్యాపీ