ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్(AP Budget 2025-26)పై మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా (RK Roja) తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు(CHandrababu) ఎన్నికలకు ముందు ప్రజలను మభ్యపెట్టి, ఇప్పుడు ఆ వాగ్దానాలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. ఇంట్లో ఎంత మంది మహిళలు ఉన్నా ప్రతి ఒక్కరికీ రూ.1500 అందిస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చారని ఆమె విమర్శించారు. అలాగే నిరుద్యోగ యువతకు నెలకు రూ.3000 భృతి ఇస్తామని హామీ ఇచ్చి, బడ్జెట్‌లో దీని గురించి ఎక్కడా ప్రస్తావించలేదని రోజా పేర్కొన్నారు.
Free Current : ఫ్రీ కరెంట్ ఇస్తున్నట్లు ప్రకటించిన మంత్రి లోకేష్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని గతంలో ప్రకటించినా, బడ్జెట్‌లో దీనికి సంబంధించిన ఎటువంటి స్పష్టత లేదని రోజా దుయ్యబట్టారు. ‘తల్లికి వందనం’ పథకానికి నిధులను తగ్గించారని, ఇది మహిళా సంక్షేమాన్ని ప్రభావితం చేస్తుందని ఆమె తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలను ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా చూస్తోందని ఆరోపించారు. రైతులకు పెట్టుబడి సాయాన్ని కుదించేందుకు ప్రయత్నిస్తున్నారని, వ్యవసాయ రంగాన్ని గాడి తప్పేలా బడ్జెట్‌ను రూపొందించారని ఆరోపించారు.
SLBC Tunnel : టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది మృతి ?
ఏపీ బడ్జెట్‌లో ప్రజలకు నష్టం చేసే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని, ఇది పూర్తి మోసం అని రోజా విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచితే, ఇప్పుడు వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకపోతే ప్రజలు తిరగబడే రోజు దూరం లేదని హెచ్చరించారు. 2025–2026 వార్షిక బడ్జెట్ అంతా గ్రాఫిక్స్‌తో నింపేశారని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆక్షేపించారు.