విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

మంత్రి లోకేశ్ ఆదేశాలతో యంత్రాంగం పరుగులు పెట్టింది. విద్యార్థిని అడిగిన వెంటనే నిధులు మంజూరు కావడంతో ఏకంగా రూ.18 లక్షల వ్యయంతో CC రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు.

Published By: HashtagU Telugu Desk
Minister Lokesh

Minister Lokesh

Minister Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో మంత్రి నారా లోకేష్‌ మరోసారి తన మార్క్ చూపించారు. లీడర్ అంటే హామీలు ఇవ్వడం కాదు.. చేసి చూపించడమేనని మరోసారి నిరూపించారు మంత్రి నారా లోకేష్‌. గతేడాది జరిగిన పదో తరగతి పరీక్షల్లో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన అంగడి పావని చంద్రిక అనే విద్యార్థిని 600కి 598 మార్కులు తెచ్చుకుని రాష్ట్రంలోనే ప్రథమస్థానం సాధించింది. ఈ అద్భుతమైన విజయం సాధించిన విద్యార్థులను మంత్రి లోకేశ్ స్వయంగా కలిసి అభినందించారు.

ఈ ఆత్మీయ సమావేశంలో పావని చంద్రిక తన ఆవేదనను మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లింది. తాము రోజూ బడికి వెళ్లే ఎస్‌పేట రోడ్డు అధ్వాన్నంగా మారిపోయిందని, వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వివరించింది. విద్యార్థుల కష్టాలు విన్న వెంటనే లోకేశ్ స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏమాత్రం ఆలోచించకుండా, ఆన్ ది స్పాట్‌లోనే స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డికి ఫోన్ చేసి, వెంటనే ఆ రహదారిని నిర్మించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Also Read: ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

మంత్రి లోకేశ్ ఆదేశాలతో యంత్రాంగం పరుగులు పెట్టింది. విద్యార్థిని అడిగిన వెంటనే నిధులు మంజూరు కావడంతో ఏకంగా రూ.18 లక్షల వ్యయంతో CC రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. అడిగిన వెంటనే తమ సమస్యను పరిష్కరించి, బడికి వెళ్లే దారిని సుగమం చేసిన మంత్రి నారా లోకేశ్ కు, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డికి గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. లోకేశ్ అన్నా అంటే మాట కాదు.. చేతల్లో చూపిస్తాడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

  Last Updated: 13 Mar 2026, 08:12 PM IST