Road Accident in Chitturu District : రోడ్డు ప్రమాదాలు (Road Accident) అనేవి రోజు రోజుకు పెరగడమే తప్ప..తగ్గడం లేదు. ప్రతి రోజు పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతూ ఉండడం తో మనుషుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అతివేగం..మద్యం మత్తు..నిర్లక్షవైపు డ్రైవింగ్ కారణంగా ప్రమాదాలు అనేవి పెరిగిపోతున్నాయి. నిన్నటికి నిన్న చిత్తూరు జిల్లాలో లారీ – బస్సు ప్రమాదం(Lorry -Bus Accident )లో 08 మంది చనిపోయిన ఘటన గురించి మాట్లాడుతుండగానే మరో ప్రమాదం చోటుచేసుకుంది.
శనివారం ఉదయం బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తుండగా అరగొండ దగ్గర బెంగళూరు-చెన్నై హైవే బ్రిడ్జిపై ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న ఇన్నోవా (Innova) టైర్ పేలడంతో..ఒక్కసారిగా కారు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో స్పాట్‌లోనే ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకుంటున్నారు.
నిన్న శుక్రవారం..చిత్తూరు జిల్లా మొగిలి కనుమ రహదారిలో వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సుతో పాటు మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారు లారీలోని ఇనుప చువ్వల కింద పడి ప్రాణాలు కోల్పోయారు. చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు, ఇనుప చువ్వల కింద ఇరుక్కుపోయిన ప్రయాణీకులతో ఘటనా స్థలం భీతావహంగా మారింది. ఈ ఘటనలో ఆర్డీసీ బస్సు డ్రైవర్‌తో పాటు ఏడుగురుది మృత్యువాత పడ్డారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు.
Read Also : Spiritual : శక్తివంతమైన నువ్వుల నూనె దీపం వెలిగించడం గ్రహ సమస్యలు నయం అవుతాయా?