Site icon HashtagU Telugu

Jr.NTR : ఎన్టీఆర్ సినిమాల్ని ఎవరూ ఆపలేరు – రోజా

Roja Ntr Movies

Roja Ntr Movies

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి జూ. ఎన్టీఆర్ (Jr . NTR) పేరు హాట్ టాపిక్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దుగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ (Duggupati Venkateswara Prasad) పై ఆరోపణలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా (Roja) దీనిపై స్పందించారు. రాజకీయాలను, సినిమాలను కలపవద్దని, ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారని, ఆయన సినిమాలను ఎవరూ ఆపలేరని ఆమె అన్నారు. సినిమా బాగుంటే ప్రజలు చూస్తారని, ఎమ్మెల్యేలు ఎన్ని టికెట్లు కొన్నా పవన్ కళ్యాణ్ “HHVM” సినిమాను ఎవరూ చూడలేదని గుర్తు చేశారు. సినిమాలకు ఉన్న ప్రజాదరణను రాజకీయాలు ప్రభావితం చేయలేవని ఆమె అభిప్రాయపడ్డారు.

CM Chandrababu: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్!

ఈ వివాదం అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై వచ్చిన ఆరోపణలతో మొదలైంది. ఆయన జూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కొన్ని ఆడియో రికార్డింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసి అనంతపురంలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే ఈ ఆడియోలు తనవి కావని, తనపై కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అయినప్పటికీ తన పేరు ప్రస్తావనకు వచ్చినందుకు ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. తాను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానినని ఆయన తెలిపారు. ఇక మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుపాటి ప్రసాద్ గత కొంతకాలంగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆడియో కాల్స్ ద్వారా ఆయన మాట్లాడినవిగా చెబుతున్న కొన్ని వివాదాస్పద విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కూడా ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులతో తలెత్తిన ఈ ఆడియో టేపుల వివాదం మరింత రచ్చకు దారితీసింది. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లోనూ, సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.