చంద్రబాబు (Chandrababu) అమలు చేసేది సూపర్ సిక్స్ (Super 6 Schemes) కాదని, సూపర్ చీటింగ్ (Super Cheating) అని వైసీపీ నేత , మాజీ మంత్రి రోజా (Roja) ఎద్దేవా చేశారు. తిరుపతిలో ఆదివారం జరిగిన వైసీపీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘అబద్ధాలు చెప్పి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఓట్లేసిన జనాన్ని మోసం చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన తప్పుడు ప్రచారాన్ని నమ్మి ప్రజలు నట్టేట మునిగిపోయారు. పాలిచ్చే ఆవును వదులుకుని, తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు’ అని ఆమె వ్యాఖ్యానించారు.
ఇక పేర్ని నాని (Perni Nani) సైతం కూటమి సర్కార్ పై విమర్శలు కురిపించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ లు ప్రజలను మోసం చేస్తున్నారని, వైసీపీని అణగదొక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ (YSRCP) నేతలు, కార్యకర్తల్ని వేధిస్తున్నారని దుయ్యబట్టారు.తమకు వేధించిన వారికి 10 రెట్లు తిరిగిస్తామన్నారు. వైఎస్సార్సీపీకి కార్యకర్తలే బలమని, వారిని ఎవరెంత కొట్టినా, తిట్టినా జెండాను వదలరని, అది తమ పార్టీ కార్యకర్తలకు ఉన్న చిత్తశుద్ధి అని పేర్కొన్నారు. జగన్ తల్లి, చెల్లెలి గురించి మాట్లాడుతున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు తమ చెల్లెళ్లకు ఎంత ఆస్తి రాసిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also : Durgamma : 4 లక్షల గాజులతో వెలిగిపోయిన బెజవాడ దుర్గమ్మ
