బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుఫాను (Dana Cyclone) వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD ఇప్పటికే హెచ్చరించింది. ఇది అరేబియా సముద్రంలో ఏర్పడిన ఒక తుపాను. ఈ తుఫాను సమయంలో భారీ వర్షాలు, గాలులు, మరియు సముద్రపు అలల భారీగా ఉండనున్నాయి. దానా తుఫాన్ వల్ల సముద్ర ప్రాంతాల్లో చేపలు పట్టే వారికి, తీరప్రాంత ప్రజలకు, నౌకా రవాణాకు, మరియు వ్యవసాయ కార్యకలాపాలకు రిస్క్ ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది.
ఈ తుఫానుకు దానా అని నామకరణం చేసిన దేశం ఖతర్. ప్రపంచ వాతావరణ సంస్థ(WMO) రూపొందించిన ఉష్ణమండల తుఫాను నామకరణ విధానం ప్రకారం ఖతర్ ఈ పేరు పెట్టింది. దానా అనే పదానికి అరబిక్లో ‘ఉదారత’ అని అర్థం. “దానా” తుఫాను ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ ప్రకారం, ఈ తుపాను గురువారం తెల్లవారు జామున తీవ్ర తుపానుగా మారి, ఆ రాత్రి ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తీరాలను తాకవచ్చునని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం దానా తుపాను ఒడిశా రాష్ట్రంలోని పారాదీప్ కు ఆగ్నేయంగా 670 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ద్వీపానికి దక్షిణ-ఆగ్నేయంగా 720 కిలోమీటర్లు, బంగ్లాదేశ్ లోని ఖేపుపురకు దక్షిణ-ఆగ్నేయంగా 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకరించబడింది. గత ఆరు గంటలుగా పశ్చిమ-వాయువ్య దిశగా గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ తుఫాన్ ప్రభావం వల్ల అతి భారీ వర్షాలు , తీరప్రాంతాల్లో విపరీతమైన గాలులు వీస్తాయి.
Read Also : Protest : ఆందోళన బాట పట్టనున్న తెలంగాణ రైతులు & ఉద్యోగ సంఘాలు