YS Jagan Vs Employees: జ‌గ‌న్ దెబ్బ‌కు ఉద్యోగుల విల‌విల‌!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మొండోడంటూ చాలా మంది ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో మాట్లాడుకుంటారు.

  • Written By:
  • Updated On - September 8, 2022 / 04:41 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మొండోడంటూ చాలా మంది ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో మాట్లాడుకుంటారు. ఆయ‌న్ను వ్య‌తిరేకిస్తే ఎవ‌ర్నైనా లెక్క‌పెట్ట‌ర‌ని చెబుతుంటారు. పైగా ఆయ‌న చెప్పిన అభిప్రాయాన్ని తూచా త‌ప్ప‌కుండా పాటించే అధికారులు, ఉద్యోగులను ఇష్ట‌ప‌డతార‌ట‌. సొంత అభిప్రాయాల‌ను చెప్పే ఉద్యోగుల‌ను ప‌క్క‌న పెడ‌తార‌ని స‌చివాల‌య వ‌ర్గాల్లోని టాక్‌. `మొండోడు రాజుక‌న్నా బ‌ల‌మైనోడని పెద్ద‌ల సామెత‌. ఆ సామెత‌కు మ‌రింత ప‌దునెక్కేలా రాజుగా(సీఎంగా) మొండోడు అయ్యాడు.` అంటూ సెటైర్లు వేసుకునే స‌చివాల‌య ఉద్యోగుల బ్యాచ్ ఉంది. అందుకే, ఆ బ్యాచ్ `మిలియ‌న్ మార్చ్` కు నైస్ గా సైడ‌వుతోంద‌ని టాక్‌.

ఏపీ టీచ‌ర్లు, ఉద్యోగులు సెప్టెంబ‌ర్ 11వ తేదీన `మిలియ‌న్ మార్చ్` కు సిద్ధం అయ్యారు. కానీ, ఉద్యోగ సంఘాల్లో ఇప్పుడు ఐక్య‌త పూర్వం మాదిరిగా లేదు. కొంద‌రు జీపీఎస్ 2.0ను స‌మ‌ర్థిస్తూ జ‌గ‌న్ ప‌క్షాన నిలుస్తున్నారు. మ‌రికొంద‌రు ఉద్య‌మించ‌డానికి ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌డంలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉద్యోగుల‌కు, జ‌గ‌న్ స‌ర్కార్ కు మ‌ధ్య జ‌రిగిన అంత‌ర్యుద్ధంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిదే పైచేయిగా నిలిచింది. ఆయ‌న ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత జ‌రిగిన `ఛ‌లో విజ‌య‌వాడ‌` ప్ర‌భుత్వానికి మాయ‌ని మ‌చ్చ‌గా ఉంది. మ‌ళ్లీ అలాంటి ప‌రిస్థితి రాకుండా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విజ‌య‌వంతంగా ఉద్యోగుల‌ను రెండుగా చీల్చాడ‌ని స‌చివాల‌య వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆ క్ర‌మంలో `మిలియ‌న్ మార్చ్` గ‌తంలో జ‌రిగిన `చ‌లో విజ‌య‌వాడ‌` త‌ర‌హాలో విజ‌య‌వంతం కాద‌ని భావిస్తున్నారు.

Also Read:  AP Politics : కృష్ణా జిల్లా రాజ‌కీయంపై చంద్ర‌బాబు ఫోక‌స్

అప్ప‌ట్లో పోలీసులు కూడా `చ‌లో విజ‌య‌వాడ‌` విజ‌య‌వంతానికి స‌హ‌కారం అందించారు. అందుకే ఆనాడున్న డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ ను వెంట‌నే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మార్చేశారు. ఆయ‌న స్థానంలో సొంత సామాజిక‌వ‌ర్గంకు చెందిన రాజేంద్ర‌నాథ్ రెడ్డిని డీజీపీగా పెట్టుకున్నారు. అందుకే, పోలీసు స‌హ‌కారం `మిలియ‌న్ మార్చ్ `కు ఉండే అవ‌కాశం ఏమాత్రం లేదు. పైగా ఇప్ప‌టికే `చ‌లో విజ‌య‌వాడ‌` కార్య‌క్ర‌మంలో చురుగ్గా పాల్గొన్న టీచ‌ర్లు, ఉద్యోగుల మీద పెద్ద ఎత్తున కేసులు పెట్టారు. వాళ్లు మ‌ళ్లీ ఉద్య‌మానికి రాకుండా ఉండేలా పోలీసులు ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. ఆ కేసుల నుంచి బ‌య‌ట ప‌డేందుకు వాళ్లు నానా తంటాలు ప‌డుతున్నారు. ఉద్య‌మాన్ని ముందుండి న‌డిపించే టీచ‌ర్లు, ఉద్యోగులు ప్ర‌స్తుతం పోలీసు క‌నుస‌న్న‌ల్లో ఉన్నారు. ఏ మాత్రం తోక‌జాడించిన‌ప్ప‌టికీ ఉద్యోగాలు పోయే ప్ర‌మాదం ఉంది.

`సీపీఎస్ ర‌ద్దు` తొంద‌పాటు హామీగా మంత్రి బొత్సా స‌త్యానారాయ‌ణ తేల్చేశారు. ఆ హామీని ముగిసిన అధ్యాయంగా భావించాల‌ని ఉద్యోగుల‌కు స్ప‌ష్టంగా చెప్పారు. సెప్టెంబ‌ర్ 11వ తేదీన `మిలియ‌న్ మార్స్` కి సిద్ధం అవుతోన్న టీచ‌ర్ల‌తో ప‌లుమార్లు ఆయ‌న స‌మావేశం అయ్యారు. ప్ర‌భుత్వం ఇస్తానంటోన్న జీపీఎస్ కు కొన్ని మార్పులు చేసి జీపీఎస్ 2.0 ను ఉద్యోగుల ముందు ఉంచారు. అయిన‌ప్ప‌టికీ టీచ‌ర్లు, ఉద్యోగ సంఘాల నేత‌లు స‌సేమిరా అంటున్నారు. సీపీఎస్ ర‌ద్దు మిన‌హా మ‌రో ప్ర‌త్యామ్నాయం కుద‌ర‌ద‌ని తేల్చేశారు. దీంతో ఏపీలోని టీచ‌ర్లు, ఉద్యోగులు వ‌ర్సెస్ జ‌గ‌న్ స‌ర్కార్ గేమ్ తీవ్ర‌రూపం దాల్చింది.

Also Read: Jagananna Sports Club APP : జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను ప్రారంభించిన మంత్రి ఆర్.కే.రోజా

ప్ర‌భుత్వం ప‌లు మార్గాల ద్వారా ఉద్యోగుల‌ను బుజ్జ‌గిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తింటోంద‌న్న కోణం నుంచి `మిలియ‌న్ మార్చ్` ఉంటుంద‌ని చెబుతూనే ఇటీవ‌ల నిర్వ‌హించిన `ఛ‌లో విజ‌య‌వాడ‌` కేసుల‌ను మాఫీ చేయించుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ కేసుల గురించి బుధ‌వారం జరిగిన చర్చల్లో మంత్రి బొత్సా ఎదుట ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. కేసుల్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని మంత్రుల స‌బ్ క‌మిటీని ఉద్యోగ నేతలు కోరారు.అయితే సీఎం జగన్ తో గురువారం చర్చించిన తర్వాత కేసులపై తుది నిర్ణయం తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ఫ‌లితంగా ఉద్యోగుల భ‌విష్య‌త్ సీఎం జగ‌న్మోహ‌న్ రెడ్డి గుప్పెట్లో ఉంది. ఆ క‌రుణిస్తే స‌రి, లేదంటే కొంద‌రి ఉద్యోగాలు `హుష్ కాకి`! కావ‌డం ఖాయం. అందుకే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉద్యోగుల‌పై పైచేయి సాధించిన తొలి సీఎంగా చ‌రిత్ర‌లో నిలిచిపోతారు. పెద్ద‌ల సామెత‌లా మొండోడు సీఎం(రాజు) అయితే అంతే మ‌రి! ఉద్యోగులూ బీ కేర్!