AB Venkateswara Rao: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు (ఏబీవీ) అమలాపురం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. నేడో, రేపో దీనిపై ఆయన ప్రకటన చేస్తారనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ అధి నాయకత్వంతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ టీడీపీలో చేరితే.. వెంకటేశ్వర రావుకు ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉందట. అయినా ఆయన వ్యూహాత్మకంగా మరో పార్టీలోకి చేరాలని డిసైడయ్యారట. ఎందుకంటే ఏబీ వెంకటేశ్వర రావు చూపు ప్రస్తుతం బీజేపీ వైపు ఉందట. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని డిసైడయ్యాకే.. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఏబీ వెంకటేశ్వర రావు విమర్శలు చేయడం మొదలుపెట్టారట. ఏబీవీ(AB Venkateswara Rao) తన రాజకీయ ప్రస్థానంలో జగన్ బాధితులను పరామర్శించడానికి రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారట. 1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఏబీ వెంకటేశ్వర రావు పొలిటీషియన్ అవతారమెత్తితే.. తన సీనియార్టీతో జగన్‌కు చుక్కలు చూపించడం ఖాయమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
Also Read :Yusuf Vs BJP : టీ తాగిన యూసుఫ్ పఠాన్ .. బీజేపీ భగ్గు
వైఎస్సార్ సీపీ హయాంలో ఎదుర్కొన్న వేధింపులివీ..
- 2014-2019లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలీజెన్స్ చీఫ్‌గా పని చేశారు.
- 2019 జూన్‌లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏబీ వెంకటేశ్వర రావు ఎన్నో కక్ష సాధింపు చర్యలను ఎదుర్కొన్నారు. జగన్ సీఎం పీఠం ఎక్కగానే ఏబీవీని టార్గెట్ చేశారు. ఆయనను పోస్టింగ్ నుంచి తప్పించారు.
- ఏరోస్టాట్, యూఏవీ భద్రత పరికరాల కొనుగోళ్లలో ఏబీ వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడ్డారంటూ 2020 ఫిబ్రవరిలో సస్పెండ్ చేసింది.దీనిపై ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని 2022లో కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన్ను వైఎస్సార్ సీపీ సర్కారు ప్రింటింగ్ ప్రెస్ కమిషనర్‌గా నియమించింది.
- మళ్లీ 2022 జూన్ 28న రెండోసారి సస్పెండ్ చేసింది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు తన సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ క్యాట్‌ను ఆశ్రయించారు. ఆ సస్పెన్షన్‌ను క్యాట్ ఎత్తివేసింది.
- ఏబీవీ పదవీ విరమణకు ముందు రోజు జగన్ ప్రభుత్వం ప్రింటింగ్ ప్రెస్ కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని గంటలోనే ఆయన రిటైర్ అయ్యారు.
- రిటైర్ అయ్యాక ఆయన జగన్‌పై ఏబీవీ పరోక్ష విమర్శలు గుప్పించారు. జగన్ కరోనాని ‘కమ్మ’రోనా అంటూ అన్నింటికీ కులాలను ఆపాదించారని ఆరోపణలు గుప్పించారు. సీఎం కుర్చీ కోడుకి కూడా సరితూగని తుచ్ఛుడు ఆ సీటులో కూర్చున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
- ఏపీలో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. ఆ నాలుగేళ్ల సస్పెన్షన్ కాలాన్ని సర్వీస్ పీరియడ్‌గా క్రమబద్ధీకరించింది. ఈ కాలంలో ఏబీవీకి చెల్లించాల్సిన వేతనాన్ని, అలవెన్సులకు సంబంధించి బకాయిలు మొత్తం చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఏబీ వెంకటేశ్వర రావుకు కొంత ఊరట లభించింది.