AB Venkateswara Rao Fire: వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలకు మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao Fire) వార్నింగ్ ఇచ్చారు. ‘‘మిస్టర్ జగన్‌రెడ్డీ.. నోరు అదుపులో పెట్టుకో.. మాట సరిచేసుకో.. భాష సరిచూసుకో! ఒకసారి ప్రజల విశ్వాసం కోల్పోయినా.. ఒకసారి నోరుజారినా.. తిరిగి వాటిని ఎన్నటికీ పొందలేరు. నీలా కుసంస్కారంతో నేను మాట్లాడను. నేనేంటో.. తలవంచని నానైజం ఏంటో గడిచిన ఐదేళ్లలో నువ్వే చూశావ్. Be careful’’అని పేర్కొన్నారు.
అయితే నిన్న మీడియా సమావేశం నిర్వహించిన వైఎస్ జగన్ కొందరు రిటైర్డ్ అధికారులు పేర్లు చదివి వారు చంద్రబాబుకు తొత్తుగా మారారని, వీరి పనే సీఎం చంద్రబాబుకు జిల్లాలో వ్యతిరేకంగా పని చేసేవారిని గుర్తించి వారి సమాచారం టీడీపీ వర్గాలకు ఇవ్వటం అని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ సమయంలో జగన్ ఏబీ వెంకటేశ్వరరావు పేరు చెప్పారు. ఇందుకు కౌంటర్‌గా ఆయన తాజాగా ట్వీట్ చేశారు.
Also Read: MLC Kavitha : ‘‘అదానీకొక న్యాయం.. ఆడబిడ్డకొక న్యాయమా ?’’.. ప్రధాని మోడీకి కవిత ప్రశ్న
ఇదిలా ఉండగా.. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు పట్ల జగన్ ప్రభుత్వం ఎలా ప్రవర్తించిందో అందరికీ తెలిసిందే. తన ఉద్యోగం కోసం ఆయన న్యాయస్థానాలకు వెళ్లి పోరాటాలు చేయాల్సిన ఘటనలు ఏర్పడ్డాయి. జగన్ ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని, కావాలనే కక్షపూరితంగా తన పట్ల వ్యవహరిస్తున్నారని ఆయన న్యాయస్థానంలో కూడా తెలిపారు. చివరకు అదే న్యాయస్థానంలో గెలిచారు. అయితే రిటైర్డ్ రోజే ఉద్యోగం చేపట్టని ఏబీ వెంకటేశ్వర రావు అదే రోజు ఉద్యోగంతో పాటు పదవీ విరమణ చేశారు. ఆ సమయంలో ఈ వార్త సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు మరికొందరు అధికారులు ఆర్పీ ఠాకూర్, యోగానంద్ పేర్లను కూడా తన మీడియా సమావేశంలో ప్రస్తావించారు జగన్. అది కూడా కనీస మర్యాద లేకుండా పేర్లు పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో కావాలంటే కింద చూడండి.
నేనేంటో.….తలవంచని నా నైజం ఏంటో గడిచిన 5 ఏళ్లలో నువ్వే చూశావ్. Be careful.
For the record, నిన్న నువ్వు నా గురించి చెప్పింది పచ్చి అబద్ధం.@ysjagan @YSRCParty pic.twitter.com/szGsEvznsA
— ABV Rao (@abvrao) November 21, 2024