CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ మేరకు బీపీసీఎల్ ఛైర్మన్, ఎండీ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులు ఆయన్ను కలిశారు. ఏపీలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై సీఎంతో వారు చర్చించారు. సుమారు రూ.60 వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటు అంశంపై సంప్రదింపులు జరిగాయని తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నం లో రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని బీపీసీల్ ప్రతినిధులు అలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, సీఎం చంద్రబాబు ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బీపీసీఎల్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.
Read Also: Nara Lokesh : నారా లోకేష్ “ప్రజాదర్బార్”కు విన్నపాల వెల్లువ
ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టే అంశంపై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక శాఖపై విడుదల చేయాల్సిన శ్వేత పత్రంపై సీఎం దృష్టి సారించారు. దీంతో పాటు మధ్యాహ్నం 3. 30 గంటలకు ఎక్సైజ్ శాఖ మీద కీలక సమీక్ష చేయనున్నారు. కొత్త ఎక్సైజ్ పాలసీ, గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
Read Also: Kalki 2898 AD OTT Release : కల్కి ఓటీటీ రిలీజ్ ఎప్పుడు.. ఎందులో వస్తుంది..?