Prakasam Barrage Gates: మునుపెన్నడూ లేని విధంగా కురిసిన వర్షాల కారణంగా విజయవాడ అస్తవ్యస్తంగా మారింది. విజయవాడ లోని లోతట్టు ప్రాంతాల్లో వరదలు విధ్వంసం సృష్టించాయి. దాదాపు నాలుగు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమని గడిపారు. ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకున్నప్పటికీ పరిస్థితి ఇంకా అలానే ఉంది. భారీ వరదలకు ప్రకాశం బ్యారేజీకి(Prakasam Barrage Gates) పగుళ్లు ఏర్పడ్డాయి.ఐతే కేవలం రెండు రోజుల్లోనే అధికారులు మరమ్మత్తులు పూర్తి చేశారు.
ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. భారీ వర్షం, కృష్ణానదిలో బలమైన నీటి ప్రవాహం ఉన్నప్పటికీ 67, 69 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్‌వెయిట్‌లను కేవలం రెండు రోజుల్లోనే మార్చారు. బ్యారేజి సూపర్‌వైజర్ కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో ఇంజనీర్లు, సిబ్బంది పట్టుదలతో పనిచేశారు. ఇటీవల ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేసిన వరదల కారణంగా అనేక పడవలు గేట్ల వద్ద చిక్కుకోవడంతో మరమ్మతులు అత్యవసరంగా మారాయి. కౌంటర్‌వెయిట్‌ను ఢీకొన్న తర్వాత ఒక పడవ విరిగిపోయింది, దీనివల్ల 67, 68 మరియు 69 గేట్ల వద్ద అడ్డంకులు ఏర్పడి దిగువకు నీటి ప్రవాహానికి అంతరాయం కలిగింది. ప్రస్తుతం కీలకమైన మరమ్మతు పనులు పూర్తికావడంతో బ్యారేజీ వద్ద సాధారణ కార్యకలాపాలు జరిగేలా అడ్డుగా ఉన్న బోట్లను తొలగించేందుకు అధికారులు దృష్టి సారిస్తున్నారు.
ఇదిలా ఉండగా విజయవాడలో వర్షపాతం తగ్గుముఖం పట్టింది. దీంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రభుత్వ సంస్థలు మరియు సైనిక సిబ్బందితో కలిసి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చే కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధికారులతో మాట్లాడి సహాయక చర్యల్లో జాప్యం జరగకుండా పని చేయాలనీ ఆదేశించారు.
Also Read: Allu Arha : వినాయక పూజ చేస్తున్న అల్లు అర్జున్ కూతురు అర్హ.. క్యూట్ వీడియో షేర్ చేసిన బన్నీ..