Site icon HashtagU Telugu

Renew Power : ఏపీలో రెన్యూ పవర్ రూ.82వేల కోట్ల పెట్టుబడి

Renewap

Renewap

ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అనేక పెద్ద సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు తమ పెట్టుబడులను ప్రకటించగా ..తాజాగా మరో భారీ సంస్థ వేలకోట్లు పెట్టుబడులు పెట్టబోతోంది. ఈ విషయాన్నీ స్వయంగా మంత్రి లోకేష్ తెలిపారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. దేశంలోని ప్రముఖ పునరుత్పత్తి శక్తి సంస్థ రెన్యూ పవర్‌ తిరిగి ఏపీలో భారీ పెట్టుబడులతో అడుగుపెడుతోంది. 2019లో కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఈ సంస్థ, ఇప్పుడు రూ.82 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను రాష్ట్రంలో అమలు చేయనున్నట్లు సంస్థ ప్రకటించినట్లు తెలిపారు. ఈ పెట్టుబడులు పునరుత్పత్తి శక్తి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కాకుండా, రాష్ట్రాన్ని దేశంలో నంబర్‌వన్ ఎనర్జీ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దనున్నాయని లోకేష్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాలు విశాఖపట్నంలో జరగబోయే సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదరనున్నాయి.

Ryan Ten Doeschate: టీమిండియాను హెచ్చ‌రించిన భార‌త కోచ్‌!

ఇక మంత్రి నారా లోకేష్ ఈ రోజు పలు ఐటీ మరియు ఇండస్ట్రియల్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో టెక్ తమ్మిన సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, సెయిల్స్ సాఫ్ట్‌వేర్, ఐ స్పేస్ సొల్యూషన్స్, ఫినోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ఐటీ కంపెనీలతో పాటు రహేజా ఐటీ స్పేస్‌, వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు కలిసి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి, వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. అంతేకాక, విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్‌ను కూడా ఇవాళ విడుదల చేయనున్నారు. దీనివల్ల తూర్పు తీరంలో పరిశ్రమల అభివృద్ధి మరింత వేగవంతం కానుంది.

Vijay Deverakonda: మ‌ళ్లీ హాట్ టాపిక్‌గా విజయ్-రష్మిక నిశ్చితార్థం.. వైరల్ అవుతున్న ‘ముద్దు’ వీడియో!

మంత్రి లోకేష్ వివరించిన ప్రకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్, ప్రధాని మోదీ సహకారం, డబుల్ ఇంజిన్ ప్రభుత్వ కృషి ఫలితంగా ఇప్పటికే రాష్ట్రానికి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఇక సీఐఐ సదస్సు సందర్భంగా మరో 410 ఎంఓయూలు – 120 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు కుదరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టులు రాబోయే 12 నెలల్లో క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన చెప్పారు. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 7.5 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టికానున్నాయి. రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం ప్రతీ అవకాశం వినియోగిస్తోందని లోకేష్ హామీ ఇచ్చారు. విశాఖలో 14, 15 తేదీల్లో జరిగే సదస్సుకు 45 దేశాల నుంచి ప్రతినిధులు, రాయబారులు, కేంద్రమంత్రులు హాజరవుతుండటం ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడి వాతావరణానికి నూతన ఉత్సాహాన్ని తెచ్చిపెట్టనుంది.

Exit mobile version