Site icon HashtagU Telugu

Annamalai: ఏపీలో కూట‌మి గెలుపును అధికారికంగా ప్రకటించడమే మిగిలింది: అన్నామలై

Annamalai

Safeimagekit Resized Img (6) 11zon

Annamalai: కోయంబత్తూరులో బీజేపీ ఎంపీ అభ్యర్థి అన్నామలై (Annamalai)తో కలిసి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ రాష్ట్ర‌ అధ్యక్షుడు అన్నామలై ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. ప్రపంచం దేశాల నుండి కంపెనీలు తెచ్చి హైదరాబాద్‌ను ఐటి రంగంలో అంతర్జాతీయ స్ధాయిలో అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుది అని అన్నామ‌లై పేర్కొన్నారు. ఏపీలో టీడీపీ-జనసేన- బీజేపీ క‌లిసి కూటమిగా పోటీ చేస్తున్నాయన్నారు.

ఏపీలో కూట‌మి గెలుపును ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలిందని అన్నారు. తమిళనాడులో డిఎమ్‌కె చేస్తున్నట్లుగానే ఏపీలోను అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును అన్యాయంగా అక్కడి పార్టీ అరెస్టు చేసిందని విమ‌ర్శించారు. ఇప్పుడు ఏపీ ప్రజలు అందరూ కూటమి వైపు చూస్తున్నారన్నారు. ఏపీ రానున్న రోజుల్లో అభివృద్ధిలో దూసుకుపోతుంద‌ని… దాన్ని మనం కూడా కళ్ళారా చూస్తామని అన్నామలై అన్నారు.

Also Read: CM Jagan Nomination: సీఎం జ‌గ‌న్ నామినేష‌న్ త‌ర్వాత ప్రచార బాధ్య‌త‌లు చేప‌ట్టనున్న వైఎస్ భార‌తి..?

అలానే కోయంబత్తూరు ఇక్కడ అభివృద్ది చెందుతుంది. కోయంబత్తూరులో ఉన్న తెలుగు ప్రజల కోసం నారా లోకేష్ ఇక్క‌డికి వచ్చారు.. నా గెలుపు కోసం వచ్చిన లోకేష్ కు ధన్యవాదాలు అని అన్నారు. అన్నామలై ఎంపీ అయితే కోయంబత్తూరు అభివృద్ధి చెందుతుందని తెలుగు వారికి చెప్పడానికి లోకేష్ వచ్చారు. తమిళనాడులో ఊహించని విధంగా బీజేపీ కూట‌మి గెల‌వ‌బోతుంద‌ని అన్నామలై అన్నారు.

We’re now on WhatsApp : Click to Join

దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చిన దార్శనిక నాయకుడు ప్రధాని మోదీ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశంసించారు. తమిళభాష, సంస్కృతి సంప్రదాయాల్ని మోదీ ఎంతో గౌరవిస్తారని పేర్కొన్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా పీలమేడు ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో లోకేశ్‌ పాల్గొని ప్రసంగించారు.