గత ప్రభుత్వ హయాంలో ఏ కంపెనీ కూడా ఏపీ వైపు చూడలేదు..ఒకవేళ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన అప్పటి మంత్రులు కమిషన్లు పెద్ద ఎత్తున అడగడం..అనేక ఇబ్బందులు పెట్టడం తో వెనక్కు వెళ్లారు. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చేసరికి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చిన్న , పెద్ద అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. మరోపక్క ప్రభుత్వం అనేక సంస్థలకు పెట్టుబడులకు ఆహ్వానాలు అందజేస్తూ..అన్ని రకాల సదుపాయాలను అందజేస్తామని హామీ ఇస్తుండడం తో ఏపీకి వరుస కంపెనీ లు క్యూ కడుతున్నాయి.
ఇప్పటికే అనేక సంస్థలు ముందుకు రాగా..తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) రాష్ట్రంలో రూ.65వేల కోట్ల (Rs.65 thousand crores) పెట్టుబడులు (Invested) పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు ‘ఎకనామిక్ టైమ్స్’ పేర్కొంది. 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుందని తెలిపింది. ఇటీవల నారా లోకేశ్ (Nara Lokesh) ముంబై పర్యటనలో అనంత్ అంబానీతో ఈ డీల్ ఫైనల్ అయిందని పేర్కొంది. దీనివల్ల రాబోయే ఐదేళ్లలో 2.5 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నట్లు వివరించింది.
రిలయన్స్ గ్రూప్ సంస్థ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో వివిధ వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇప్పుడు, ఈ భారీ పెట్టుబడులు మరింత ఆధునీకరణ మరియు అభివృద్ధి సాధించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ (పునర్వినియోగించగల ఇంధన) రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాష్ట్రంలో పర్యావరణ హిత పనులను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అంచనా. ఈ పెట్టుబడులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్థిక వృద్ధికి తోడ్పడటమే కాకుండా ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు.
Read Also : Prabodhini Ekadashi : ఇవాళ ‘ప్రబోధిని ఏకాదశి’.. దీని ప్రత్యేకత, పూజా విధానం వివరాలివీ