Site icon HashtagU Telugu

TDP BJP Janasena Manifesto: కూటమి మేనిఫెస్టో విడుద‌ల‌.. ఏపీ ప్ర‌జ‌ల‌పై వరాల జల్లు

TDP BJP Janasena Manifesto

Safeimagekit Resized Img (6) 11zon

TDP BJP Janasena Manifesto: కూట‌మిలో భాగంగా చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, బీజేపీ నేత‌లు మేనిఫెస్టో (TDP BJP Janasena Manifesto)ను విడుద‌ల చేశారు. ఈ మేనిఫెస్టోలో ప‌లు అంశాల‌తో ఏపీ ప్ర‌జ‌ల‌పై వ‌రాల జ‌ల్లు కురిపించారు. ఇందులో ఆడ‌బిడ్డ నిధి కింద ప్ర‌తి నెల‌కు మ‌హిళ‌కు రూ. 1500, మ‌హిళ‌ల‌కు ఉచిత బస్సు ప్ర‌యాణం, ప్ర‌తి ఇంటికి ఉచిత కుళాయి క‌నెక్ష‌న్‌, రైతుల‌కు ఏడాదికి రూ. 20 వేల పెట్టుబ‌డి సాయం అందిస్తామ‌ని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఈ మేర‌కు చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, బీజేపీ ముఖ్య నాయ‌కులు ఏపీ ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడిగా అందులోని అంశాలను వెల్లడించారు. టీడీపీ సూపర్ సిక్స్, జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహంతో కలిసి హామీలు ఇచ్చారు.

Also Read: Woman Stabs Daughter: మార్కుల విషయమై కత్తులతో పొడుచుకున్న తల్లీకూతుళ్లు.. కూతురు మృతి

కూటమి మేనిఫెస్టో హామీలు ఇవే

– మెగా డీఎస్సీపై తొలి సంతకం

-వృద్ధాప్య పెన్షన్ రూ.4000

– దివ్యాంగుల పెన్షన్ రూ.6000

-18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1500

– ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం

– యువతకు 20 లక్షల ఉద్యోగాలు

– రూ.3000 నిరుద్యోగ భృతి

– తల్లి వందనం ఏడాదికి ఒక్కో బిడ్డకి రూ.15000

– మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ

– ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు పెట్టుబడి

– వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10,000

– ఉచిత ఇసుక

– అన్నా క్యాంటీన్లు

– భూ హక్కు చట్టం రద్దు

– ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్

– బీసీ రక్షణ చట్టం

– పూర్ టూ రిచ్ పథకం

– చేనేతకు 200 యూనిట్లు, మరమగ్గాలుంటే 500యూనిట్ల విద్యుత్ ఫ్రీ

– కరెంటు చార్జీలు పెంచం

– బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్

– పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం

– పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం

– పెళ్లి కానుక రూ.1,00,000/-

– విదేశీ విద్య పథకం

– పండుగ కానుకలు

We’re now on WhatsApp : Click to Join