Site icon HashtagU Telugu

AP Government : ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల

Release of Fee Reimbursement Funds

Release of Fee Reimbursement Funds

AP Government :  ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త తెలిపింది. మైనార్టీ విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసింది. ఈ మేరకు రూ.40.22కోట్ల ట్యూషన్ ఫీజు ప్రభుత్వం విడుదల చేసినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ముస్లిం మైనార్టీ స్టూడెంట్స్‌కు రూ.37.88కోట్లు, క్రిస్టియన్ మైనార్టీలకు రూ.2.34కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల చేయడంపై మైనారిటీ మంత్రి ఫరూక్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

త్వరలోనే ఈ డబ్బులు ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. నిధులు విడుదల కు కృషిచేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ మరోసారి మైనారిటీల పక్షపాతిగా నిలిచిపోయిందని చెప్పారు. రాష్ట్రంలో రాయలసీమలో ఎక్కువగా ముస్లిం మైనారిటీలు ఉన్నారు. వారి నుంచి వచ్చిన వినతి మేరకు ప్రభుత్వం స్పందించింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్‌ పాఠశాలల సమావేశాలకుకు సంబంధించి సమగ్ర శిక్షా అభియాన్‌ నిధుల్ని విడుదల చేసింంది. రవాణా భత్యం, నిర్వహణ ఖర్చుల నిమిత్తం మొత్తం రూ.28.09 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు వచ్చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,809 క్లస్టర్లు ఉంటే.. ఒక్కోదానికి రూ.లక్ష చొప్పున ప్రభుత్వం కేటాయించింది.

ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిధుల్లోంచి నిర్వహణకు రూ.30వేలు, బోధన, అభ్యసన మెటీరియల్‌కు రూ.25వేలు, ఇతర ఖర్చులకు రూ.35వేలు, రవాణా భత్యానికి రూ.10వేలు చొప్పున వ్యయానికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. కాగా, ఎస్సీ వసతి గృహాల మరమ్మత్తులతో పాటు నూతన భవనాల ఏర్పాటుకు సంబంధించి పీఎం అజయ్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. రూ. 9.15 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మొత్తాన్ని కేంద్రం గ్రాంట్ ఇన్ ఎయిట్ గా అందించింది. ఈ నిధుల వినియోగించిన అనంతరం కేంద్రానికి యూసీలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ ఎండిని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ పథకంలో భాగంగా వసతి గృహాలకు మరమ్మత్తులు. అదనపు గదులను నిర్మించనున్నారు.

Read Also: Bobbili Yuddham : బొబ్బిలి యుద్ధానికి 268 ఏళ్లు..!