Site icon HashtagU Telugu

AP : నేటి నుంచి ఏపీలో “ఆడుదాం ఆంధ్రా” కార్య‌క్ర‌మం రిజిస్ట్రేష‌న్లు ప్రారంభం

Aadudam Andhra

Aadudam Andhra

ఏపీ ప్ర‌భుత్వం క్రీడ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు ‘ఆడుదాం ఆంధ్రా’ (ప్లే ఆంధ్రా) పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా వేడుకలను నిర్వహించనుంది. 50 రోజుల పాటు గ్రామం/వార్డు, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఆటల పోటీలు జరుగుతాయి. ఆడుదాం ఆంధ్ర కోసం రిజిస్ట్రేషన్ ఈ రోజు (నవంబర్ 27) ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ డిసెంబర్ 13గా అధికారులు ప్ర‌క‌టించారు. ఆడుదాం ఆంధ్ర అంటే అందరికీ క్రీడలు అని, ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ/వార్డు సెక్రటేరియట్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారి అని మంత్రి ఆర్.కె రోజా తెలిపారు.ఆడుదాం ఆంధ్రా కార్య‌క్ర‌మంలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో, బ్యాడ్మింటన్‌తో సహా అన్ని క్రీడలు జరుగుతాయని ఆమె తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

గ్రామ స్థాయి నుండి క్రీడల ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, ప్రతిభను కనుగొనడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీలో క్రీడాకారుల‌కు గుర్తింపు ఇచ్చేలా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని ఆమె తెలిపారుజ 2024 డిసెంబరు 15 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఆడుదాం ఆంధ్రా టోర్నీ జరుగుతుందని మంత్రి రోజా తెలిపారు. ఆడుదాం ఆంధ్రలో క్రీడా వేడుకలు 50 రోజుల పాటు జరగనున్నాయని, 15 ఏళ్లు పైబడిన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. అన్ని గ్రామ/వార్డు సచివాలయాల వద్ద రిజిస్ట్రేషన్‌లు అందుబాటులో ఉంటాయని..వాలంటీర్లు రిజిస్ట్రేషన్‌లను నిర్వహించడానికి సహాయపడతారని ఆమె తెలిపారు. ఆన్‌లైన్ పోర్టల్ https://aadudamandhra.ap.gov.in/ (లేదా) ద్వారా టోల్-ఫ్రీ నంబర్ 1902కు కాల్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్‌లు చేసుకోవ‌చ్చ‌ని మంత్రి రోజా తెలిపారు.

Also Read:  Yuvagalam : నేటి నుంచి నారా లోకేష్ య‌వ‌గ‌ళం పాద‌యత్ర పునఃప్రారంభం.. పొద‌లాడ నుంచి ప్రారంభంకానున్న యాత్ర‌