Site icon HashtagU Telugu

Tirumala : తిరుమ‌లకు వెళ్లేవారికి గ‌మ‌నిక.. నేటి నుంచే ఆ టికెట్ల రిజిస్ట్రేష‌న్‌

Bomb Threats In Tirumala

Bomb Threats In Tirumala

Tirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుంచే జూన్ నెల‌కు సంబంధించిన  ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేష‌న్ ప్రారంభం కానుంది.  ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 20 వ‌ర‌కు కంటిన్యూ అవుతుంది. ఈ నెల 22న మ‌ధ్యాహ్నం వ‌ర‌కు డ‌బ్లు చెల్లించి టిక్కెట్లు క‌న్ఫామ్ చేసుకునే వెసులుబాటు క‌ల్పించారు. ఈ టిక్కెట్ల‌తో పాటు శ్రీవారి(Tirumala) ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను కూడా ఈ నెల 21న టీటీడీ విడుద‌ల చేయ‌నుంది. భ‌క్తుల కోసం ఈనెల 21న ఉద‌యం 10 గంటలకు ఈ టిక్కెట్ల‌ను అందుబాటులో ఉంచుతారు.  అదే రోజు జ్యేష్ఠాభిషేకం ఉత్సవం టిక్కెట్ల‌ను విడుద‌ల చేస్తారు. జ్యేష్ఠాభిషేకం ఉత్సవం జూన్ 19 నుంచి 21 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.

We’re now on WhatsApp. Click to Join

Also Read : Telangana Rains : తెలంగాణలో నాలుగు రోజులు తేలికపాటి వానలు