Site icon HashtagU Telugu

Real Estate : చంద్రన్న ‘పవర్’ కు ఏలూరు లో ఊపందుకున్న రియల్ ఎస్టేట్

Elur

Elur

ఉభయగోదావరి జిల్లాల్లోని నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ, ఏలూరులో రియల్ ఎస్టేట్ రంగం ఊహించని స్థాయిలో ఎదుగుతోంది. ముఖ్యంగా చంద్రబాబు (Chandrababu) నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడం తో రియల్ ఎస్టేట్ రంగం ఉత్సాహాన్ని సంతరించుకుంది. రాజమండ్రి, కాకినాడ, భీమవరం వంటి పట్టణాల తరహాలో ఏలూరులోనూ నూతన కాలనీలు, మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయి. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు సైతం సొంతూళ్లకు తిరిగి వచ్చి ఇళ్లను కొనుగోలు చేయడం, స్థలాల్లో పెట్టుబడి (Real Estate) పెట్టడం వంటి దిశగా ఆలోచిస్తున్నారు.

Video Viral : పందెం ఓడి అరగుండు గీయించుకున్న వైసీపీ వీరాభిమాని..

ఏలూరు(Eluru )ను జిల్లా కేంద్రంగా అభివృద్ధి చేయడం, రహదారి ప్రణాళికలు మెరుగుపరచడం, రవాణా సౌకర్యాలు పెరగడం వంటి అంశాల కారణంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఏలూరు వ్యవసాయం, వాణిజ్య కేంద్రంగా ఉన్నా, విద్యా, ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల యువత ఇక్కడే స్థిరపడే దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో భూములు, ఇళ్ల స్థలాలకు డిమాండ్ పెరిగింది. ఇతర ప్రాంతాల్లో సంపాదించి వచ్చిన వారు దీర్ఘకాలిక పెట్టుబడులకోసం ఇక్కడ భూములు కొంటున్నారు.

Bayya Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ ఎక్కడ?

ఏలూరు పట్టణం శివార్లలో చదరపు గజానికి రూ.10,000 నుండి రూ.25,000 వరకు భూమి ధరలు ఉన్నాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. మంచి ఇంటిని రూ.50 లక్షల పరిధిలోనే కొనుగోలు చేసే అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. తద్వారా మధ్యతరగతి, వలస వచ్చిన కుటుంబాలు ఇక్కడ నివాసాన్ని ఏర్పరుచుకునే అవకాశాలు పెరిగాయి. వచ్చే ఐదేళ్లలో ఏలూరు మరింత అభివృద్ధి చెందే అవకాశముందని, ఇది రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు మంచి లాభాలను తీసుకురావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.