Site icon HashtagU Telugu

Rayapati Aruna : ప్రమాదానికి గురైన రాయపాటి అరుణ..జనసేన శ్రేణుల్లో ఆందోళన

Rayapati Aruna Comments to Chiranjeevi

Rayapati Aruna

జనసేన పార్టీ (Janasena) అధికార ప్రతినిధి రాయపాటి అరుణ (Rayapati Aruna) ప్రమాదానికి గురయ్యారు. జనసేన పార్టీ లో నిత్యం యాక్టివ్ గా ఉండే వారిలో రాయపాటి అరుణ ముందుంటారు. పార్టీ విధానాల‌ను జ‌నాల్లో తీసుకెళ్లడంతో పాటుగా స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డం, విమ‌ర్శ‌ల‌ను దీటుగా ఎదుర్కొనే అరుణ తీరును ప‌రిశీలించిన ప‌వ‌న్ కళ్యాణ్ (Pawan Kalyan).. ఆమెను పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియమించడం జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

ప్ర‌కాశం జిల్లా ఒంగోలు న‌గ‌రానికి చెందిన అరుణ..సోషల్ మీడియా లో పార్టీ ఫై ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసిన , పవన్ కళ్యాణ్ విమర్శలు , ఆరోపణలు చేసిన వాటిని తిప్పికొట్టడం లో ముందుంటుంది. అందుకే జనసేన శ్రేణుల్లో , మెగా అభిమానుల్లో అరుణ అంటే ఎంతో అభిమానం , గౌరవం. అలాంటి అరుణ నిన్న కారు ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు బాపట్ల జిల్లా రేణంగివరం వద్ద డివైడర్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుణతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఒంగోలు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. అరుణ ప్రమాదానికి గురయ్యారని తెలిసి జనసేన శ్రేణుల్లో ఆందోళన పెరుగుతుంది. ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Read Also : 223 Employees Sacked : 223 మంది మహిళా కమిషన్‌ ఉద్యోగుల తొలగింపు.. సంచలన ఆదేశాలు