AP : ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై రాష్ట్రపతి సీరియస్

ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు (Acb Court Judge Hima Bindu) పేరు ప్రస్తుతం సోషల్ మీడియా లో & మీడియా చానెల్స్ లలో మారుమోగిపోతుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఐన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుకు సంబదించిన వాదనలు ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అయితే చంద్రబాబు కు కావాలనే జడ్జి హిమబిందు బెయిల్ ఇవ్వడం లేదని , విచారణ […]

Published By: HashtagU Telugu Desk
Acb Court Judge Hima Bindu

Acb Court Judge Hima Bindu

ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు (Acb Court Judge Hima Bindu) పేరు ప్రస్తుతం సోషల్ మీడియా లో & మీడియా చానెల్స్ లలో మారుమోగిపోతుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఐన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుకు సంబదించిన వాదనలు ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అయితే చంద్రబాబు కు కావాలనే జడ్జి హిమబిందు బెయిల్ ఇవ్వడం లేదని , విచారణ తాలూకా తీర్పులు వాయిదా వేస్తుందని కొద్దీ రోజులుగా ఆమెపై సోషల్ మీడియా లో (Social Media Posts) ప్రచారం నడుస్తుంది. కొంతమందైతే విపరీతమైన ట్రోల్స్ , మార్ఫింగ్ ఫొటోలతో వైరల్ చేస్తున్నారు.

దీనిపై జడ్జి హిమబిందు సీరియస్ అయ్యారు. ఈ విషయాన్నీ రాష్ట్రపతికి దృష్టికి తీసుకెళ్లారు. తన మార్ఫింగ్‌ ఫొటోలతో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసారు. దీంతో ఈ విషయంపై రాష్ట్రపతి భవన్ సీరియస్ (Rashtrapati Bhavan Serious) అయ్యింది. జడ్జ్ ఫై పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో జడ్జిపై సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిపై కేసులు నమోదు చేసే పనిలో పడింది రాష్ట్రం ప్రభుత్వం.

ఇక హిమబిందు విషయానికి వస్తే.. 2016లో తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేశారు. అంతకు ముందు ఆమె ఏసీబీ కోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై జస్టిస్ హిమ బిందు ఇచ్చిన రిమాండ్‌ తీర్పు అందరి దృష్టినీ ఆకర్షించింది. గతంలో కూడా ఆమె అనేక సంచలన తీర్పులు ఇచ్చారు.

Read Also : 434 Staff Nurse Posts : ఏపీలో 434 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీ.. దరఖాస్తు ప్రక్రియ ఇదీ

  Last Updated: 23 Sep 2023, 02:21 PM IST