Jr NTR: ‘జూనియర్’ లేని ఎన్టీఆర్ శత జయంతి!

తాత వారసత్వాన్ని కొనసాగిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) శత జయంతి వేడులకు దూరంగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది.

Published By: HashtagU Telugu Desk
Junior

Jrntr

విలక్షణ నటుడు, రాజకీయ నాయకుడు దివంగత ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి నందమూరి బాలయ్య (Balakrishna), సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajini Kanth), ఇతర రాజకీయ నాయకులు హాజరువుతున్నారు. అయితే ఎన్టీఆర్ మనవడు, ప్రతిభావంతుడైన నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు పిలుపు లేకపోవడంతో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో నిరాశ నెలకొంది.

నో ఇన్విటేషన్

టాలీవుడ్ నివేదికల ప్రకారం.. తన తాత వారసత్వాన్ని కొనసాగిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఆహ్వానితుల జాబితాలో లేడు. దీంతో నందమూరి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్‌ని అతని స్వంత కుటుంబం పక్కన పెట్టిందనీ చర్చించుకుంటున్నారు. ఏప్రిల్ 28వ తేదీన విజయవాడలో జరుగుతున్న శతాబ్ది ఉత్సవాలు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో సహా భారతీయ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే, గెస్ట్ లిస్ట్‌లో (Guest List) జూనియర్ లేకపోవడం ఆయన అభిమానులకు ఏమాత్రం మింగుడు పడటం లేదు.

జూనియర్ అభిమానుల్లో ఆందోళన

జూనియర్ ఎన్టీఆర్‌ని ఆహ్వానించకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఎన్టీఆర్ తనయుడు, నందమూరి బాలకృష్ణ, అభిమానులతో (Nandamuri Fans) సహా అందరికీ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానం పంపగా, జూనియర్ ను విస్మరించడం అంతు పట్టడం లేదు. ఉత్సావాల్లో జూనియర్ ఎన్టీఆర్ లేకపోవడం అటు నందమూరి అభిమానులు, ఇటు జూనియర్ అభిమానుల్లో అనేక విమర్శలకు దారితీస్తోంది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతారా, లేక దూరంగా ఉంటారా? అనేది వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి, నందమూరి అభిమానులు నిరాశకు గురవుతున్నారు. కుటుంబ సభ్యులు తమ విభేదాలను పక్కనబెట్టి జూనియర్ ఎన్టీఆర్ ను కలుపుకొని పోవాలని నందమూరి అభిమానులు బహటంగానే చర్చించుకుంటున్నారు. కొసమెరుపు ఏంటంటే నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఈ వేడుకులకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.

రజనీకాంత్‌ కు ఘనస్వాగతం

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ విజయవాడ చేరుకున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు ఆయన విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో నందమూరి బాలకృష్ణ, టీడీ జనార్ధన్‌, సావనీర్‌ కమిటీ రజనీకాంత్‌కు ఘన స్వాగతం పలికారు. నేడు సాయంత్రం పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల సభ జరగనుంది. ఈ వేదికపై ఎన్టీఆర్‌ చారిత్రక ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్‌ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్యపరుస్తూ వివిధ వేదికల మీద చేసిన ప్రసంగాలను ఈ పుస్తకాల్లో పొందుపరిచారు.

Also Read: Gurukul: గురుకుల్లో టీజీటీ పోస్టులు 75 శాతం మహిళలకే!

  Last Updated: 28 Apr 2023, 11:51 AM IST