Jagan AP CM: రామ రామ! జగన్ మడమ నొప్పికి మతం ముసుగు..

ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని కల్యాణం ముందురోజు జగన్ కాలి గాయం రేపిన రాజకీయ అనుమానంకు తెరపడలేదు. ఉద్దేశప్రకారం తలంబ్రాలు తీసుకెళ్లలేదని టీడీపీ క్రమంగా ఆ విషయాన్ని హైలైట్ చేస్తుంది.

  • Written By:
  • Publish Date - April 10, 2023 / 01:41 PM IST

Jagan AP CM: ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని కల్యాణం ముందురోజు జగన్ కాలి గాయం రేపిన రాజకీయ అనుమానంకు తెరపడలేదు. ఉద్దేశప్రకారం తలంబ్రాలు తీసుకెళ్లలేదని టీడీపీ క్రమంగా ఆ విషయాన్ని హైలైట్ చేస్తుంది. వాస్తవంగా సీఎం కాకముందు జగన్ మీద ఉన్న ప్రధాన ఆరోపణ ఆయన క్రైస్తవుడు కాబట్టి హిందూ పండగలను, మతాన్ని విశ్వసించడు అనే ముద్ర ఉంది.హిందువులను తొక్కేస్తాడని చాలా రకాల అనుమానాలు, ఆరోపణలు, విమర్శలు ప్రత్యర్థి పార్టీల నాయకులు చేసేవారు. జగన్ పాదయాత్ర సందర్భంగా ఆలయాల సందర్శన చేశారు. తర్వాత స్వరూపనందేంద్రని కలిశారు. దాన్ని చూసి చాలా మంది జగన్ మతం మారిపోయారని ప్రచారం చేశారు. వైసీపీ వాళ్లే ఎక్కువగా ప్రచారం చేశారు. అయితే.. చాలా మంది భార్యను ఎందుకు తీసుకెళ్లడం లేదనే విమర్శలు ఆయనపై ఎక్కుపెట్టారు.

కానీ ఆయన సంప్రదాయబద్దంగానే తిరుమలకు వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించడం చేస్తుంటారు. తాజాగా జగన్ (Jagan) మత అంశాన్ని టీడీపీ లేవనెత్తింది. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నవమి రోజు కాకుండా వారం రోజుల తర్వాత సీతారాముల కల్యాణం జరుగుతుంది. గతంలో రాష్ట్రం విడిపోక ముందు తెలంగాణలో ని భద్రాచలంలో సీతారాముల కల్యాణానికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించేవారు. ఇప్పుడు ఒంటిమిట్టలో జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. అయితే ఈ ఏడాది సీఎం కాలు బెణికింది. ఎక్సర్ సైజు చేసే సమయంలో అని అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఇది సీతారాముల కల్యాణానికి ముందు రోజు జరిగింది. కంప్లీట్ గా బెడ్ రెస్ట్ తీసుకుంటున్నట్లు సీఎంవో నుంచి ప్రకటించారు.

కానీ ఆ మరునాడే డాక్టర్ ప్రోగ్రాం కు సంబంధించి ఇంటింటి కి డాక్టర్ అనే పథకాన్ని ప్రవేశపెట్టినపుడు జగన్ మామూలుగానే నడిచారు. ఈ అంశాన్ని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు జగన్ ని విమర్శిస్తూ కాలు నొప్పి ఇప్పుడే తగ్గిపోయిందా.. అని ప్రశ్నించారు. నిన్నటి దాకా బాగోలేదని అన్న సీఎం ఒక్క రోజులోనే ఎలా తిరిగి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని విమర్శించారు. దీనిపై సీఎంవో స్పందించాల్సిన అవసరం ఉంది. ఒక వేళ అచ్చెన్నాయుడు అడిగిన ప్రశ్నకు సీఎంవో ఏమని సమాధానం చెబుతుందోనని అందరూ చూసారు. కానీ లైట్ గా తీసుకుంది. దీనితో అనుమానం పెరిగింది. మతం కోణం మళ్ళి హైలైట్ అయింది.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తన నివాసంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు కలిసి ఆహ్వాన శుభ పత్రికను అందించారు. ఏప్రిల్‌ 5వ తేదీన రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకూ శ్రీసీతారామ కల్యాణ మహోత్సవం జరిగాయి. అదే సమయంలో మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్‌ 09 తేదీ వరకూ ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరిపారు. కళ్యాణం రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒంటిమిట్ట పర్యటన రద్దయింది. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల కల్యాణం రోజు సంప్రదాయంగా ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించే ఆనవాయితీకి దూరంగా ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈసారి జరిగిన కల్యాణానికి వస్తున్నట్లు అధికారిక కార్యక్రమం ఖరారైనా చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దయింది. దీంతో రాజకీయ రగడను రేపింది.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒంటిమిట్ట పర్యటన రద్దు చేసుకోవడాన్ని బీజేపీ నాయకులు తప్పు పట్టారు. ఉద్దేశ పూర్వకంగానే ముఖ్యమంత్రి ఒంటిమిట్ట పర్యటన రద్దు చేసుకొన్నారని రమేష్ నాయుడు విమర్శించారు. ఒంటిమిట్ట శ్రీ సీతా రాముల వారి కళ్యాణానికి మించిన పనులు జగన్ (Jagan) గారికి ఏమున్నాయో తెలియదని, ఓటు బ్యాంక్ రాజకీయాలు మాత్రం దాగున్నాయని విమర్శించారు. అన్యమతస్థులు ప్రాపకం కోసమే ఉద్దేశపూర్వకంగా ఒంటిమిట్ట పర్యటన ఎగ్గొట్టారని ఆరోపించారు. ఈ వ్యవహారం మీద స్వామీజీలు వివరణ కోరాలని డిమాండ్ చేశారు.
అన్యమతస్తుల ఓటు బాంక్ కోసం జగన్ ఇలా చేశారని మతం కోణం నుంచి ప్రత్యర్థి పార్టీలు దుమారం రేపుతున్నారు.

Also Read:  KCR vs Modi: మోడీపై తిరుగుబాటు కేసీఆర్ చతురత