AP Capital : ఏపీకి అమరావతే ఏకైక రాజధాని – రాజ్ నాథ్​సింగ్

ఏపీకి అమరావతే ఏకైక రాజధాని (AP Capital Amaravati) అని కేంద్రమంత్రి రాజ్ నాథ్​సింగ్ (Union Minister Rajnath Singh) తేల్చి చెప్పారు. ఈరోజు మంగళవారం విజయవాడలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో రాజ్‌నాథ్‌ సింగ్ పాటుగా పార్టీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. We’re now […]

Published By: HashtagU Telugu Desk
Rajnadh Ap

Rajnadh Ap

ఏపీకి అమరావతే ఏకైక రాజధాని (AP Capital Amaravati) అని కేంద్రమంత్రి రాజ్ నాథ్​సింగ్ (Union Minister Rajnath Singh) తేల్చి చెప్పారు. ఈరోజు మంగళవారం విజయవాడలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో రాజ్‌నాథ్‌ సింగ్ పాటుగా పార్టీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా రాజ్ నాధ్ సింగ్ మాట్లాడుతూ..త్వరలో భారతదేశం ప్రపంచంలోనే గొప్ప ఆర్ధిక వ్యవస్థగా ఎదగబోతోందని తెలిపారు. రక్షణ వ్యవహారాల్లో మనం సాధిస్తోన్న పురోగతి ప్రపంచ దేశాల ముందు తలెత్తుకునేలా చేస్తోందన్నారు. వచ్చే ఐదేళ్లలో ఏపీలోను బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని, ఇది తనకున్న 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నానని పేర్కొన్నారు. బీజేపీ మూల సిద్ధాంతం రాజకీయం ఒక్కటే కాదని ప్రజలకు సేవ కూడా తమ లక్ష్యమని తెలిపారు. ఏపీకి రాజధాని ఏదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని కొందరు నేతలు రాజ్ నాధ్ వద్ద ప్రస్తావించగా.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన సమాచారం ఇచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ కూడా అమరావతినే ఏకైక రాజధానిగా పరిగణనలోకి తీసుకుందని, ఈ విషయంలో ఎలాంటి చర్చ లేదని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆయుష్మాన్‌భవ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమ పథకంగా ప్రచారం చేసుకుంటోందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. మొత్తం నిధులు వారే ఇస్తున్నట్లుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారంటూ రాజ్‌నాథ్‌సింగ్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇది సరైందని కాదని రాజ్‌నాథ్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. తాము ఈ విషయంలో ఆందోళన చేస్తున్నామని, కేంద్ర ఆరోగ్యశాఖ దృష్టికి కూడా తీసుకెళ్లామని – ఫలితంగా కేంద్ర ప్రభుత్వ లోగోను ఇటీవలే ఆరోగ్యశ్రీ కార్డులపై వేస్తున్నారని పురందేశ్వరి తెలిపారు. నిర్భయ కింద కేంద్ర ప్రభుత్వం 138 కోట్ల రూపాయలు రాష్ట్రానికి కేటాయించినా మహిళలు, బాలికల రక్షణ కోసం వైసీపీ ప్రభుత్వం తగిన మౌలిక వసతులు కల్పించలేదని రాజ్‌నాథ్‌సింగ్‌ దృష్టికి తీసుకెళ్లారు.

Read Also : Koduru Kamalakar Reddy : వైసీపీకి మరో షాక్..కోడూరు కమలాకర్ రెడ్డి రాజీనామా

  Last Updated: 27 Feb 2024, 08:24 PM IST