Site icon HashtagU Telugu

Posani Krishna Murali : పోసాని ఫై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

Posani Krishna Murali Sensational comments on Telugu producers

Posani Krishna Murali Sensational comments on Telugu producers

సినీ నటుడు, ఏపీ ఫిల్మ్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali ) కి రాజమండ్రి కోర్ట్ షాక్ ఇచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై ఆయన అనుచిత వాఖ్యలు చేశారని జనసేన పార్టీ నేతలు రాజమహేంద్రవరం పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. ఈ పిర్యాదు ఫై పోలీసులు ఏమాత్రం స్పందించడం లేదని, జనసేన నేతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో వారి వాదనలు విన్న న్యాయస్థానం పోసానిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పోసాని కృష్ణమురళి పై IPC 354, 355, 500,504, 506, 5007, 5009 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరి పోసాని అదుపులోకి తీసుకుంటారో..లేక అధికార పార్టీ నేత అని చెప్పి లైట్ తీసుకుంటారో చూడాలి.

గత కొద్దీ రోజులుగా పోసాని రెచ్చిపోతున్నారు. టీడీపీ – జనసేన పార్టీల ఫై విమర్శలు, సెటైర్లు చేస్తూ వస్తున్నారు. నిన్నటికి నిన్న నారా భువనేశ్వరి , నారా బ్రహ్మణి లను పోసాని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో భర్తలని మించిన భార్యలు ఉన్నారంటూ నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari), బ్రహ్మణి (Nara Bramhani) టార్గెట్ గా పరోక్షంగా విమర్శలు చేశారు. తప్పు చేస్తే నిలదీయాల్సింది పోయి.. సమర్థిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

We’re now on WhatsApp. Click to Join.

పవన్ కళ్యాణ్ ఓ పిచ్చోడు, అమాయకుడు

భర్త, కొడుకు నాశనం కావటానికి ప్రధాన కారణం భువనేశ్వరేనంటూ తీవ్ర వాఖ్యలు చేశారు. అత్తాకోడళ్లు ఇద్దరూ మా ఆయన మంచివాళ్ళని అనుకుంటున్నారని సెటైర్లు వేశారు. చంద్రబాబును (Chandrababu) జైలుకు పంపింది జగన్ (CM jagan) ఎలా అవుతారని ప్రశ్నించారు పోసాని. అలా పంపించాలనుకుంటే నాలుగేళ్ల ముందే పంపించే వారు కదా అని అన్నారు. ఒక్కపుడు చంద్రబాబు, లోకేష్ (Nara Lokesh) ను తిట్టిన పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) ఇప్పుడు ఆయనను ముఖ్యమంత్రిని చేస్తా అంటున్నాడంటూ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పిచ్చోడు, అమాయకుడంటూ తీవ్ర వాఖ్యలు చేశారు పోసాని. కాపు ఓట్ల కోసమే టీడీపీ నేతలు పవన్ కల్యాణ్‌ ను వాడుకుంటున్నారని ఆరోపించారు. భారతదేశానికి ఒకరే గాంధీ.. కానీ ఏపీకి చంద్రబాబు, లోకేష్ ఇద్దరు గాంధీలంటూ సెటైర్లు విసిరారు. జగన్ మోహన్ రెడ్డి నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొన్నప్పుడు సత్యమేవ జయతే ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. జయప్రద లాంటి వాళ్లు ప్రజాసేవ కోసం వస్తే వాళ్ళ జీవితాలను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు.

Read Also : MLC Kavitha: జాగృతి ఆధ్వర్యంలో21న యూకేలో బతుకమ్మ సంబరాలు