Site icon HashtagU Telugu

Chandrababu : చంద్రబాబుకు రాజాసింగ్ రిక్వెస్ట్

Rajasingh Ttd

Rajasingh Ttd

తిరుమల(Tirumala)లో ముస్లిం వ్యక్తి నమాజ్ (Muslim Man Praying) చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమలలోని కళ్యాణ వేదిక సమీపంలోని ఖాళీ స్థలంలో ఓ ముస్లిం వ్యక్తి బహిరంగంగా నమాజ్ చేయడం కలకలం రేపింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో భక్తులు, నెటిజన్లు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

Minister Instructions: కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణపై సమీక్ష.. మంత్రి కీల‌క సూచ‌న‌లు!

ఈ ఘటనపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడులను ఉద్దేశిస్తూ వీడియో సందేశం విడుదల చేశారు. తిరుమలలో ఇలాంటి అపచారాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నమాజ్ చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తిరుమలలో భద్రతా చర్యలు మరింత కఠినంగా ఉండాలనీ, హిందువుల పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం, టీటీడీ నడుం కట్టాలని కోరారు.

రాజాసింగ్ తన వ్యాఖ్యల్లో గతంలో జరిగిన వివాదాస్పద ఘటనలను ప్రస్తావిస్తూ, ఇప్పుడీ పరిస్థితులు కొత్తకావని తెలిపారు. అన్యమతస్థులు తిరుమలలో పనిచేయడం, లడ్డూ కల్తీ ఆరోపణలు, మత మార్పిడుల ప్రచారాలన్నీ హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విషయాలుగా పేర్కొన్నారు. భక్తుల డ్రైవర్ల ఐడీ కార్డులను కచ్చితంగా తనిఖీ చేయాలని, ఇతర మతాల వారికి తిరుమల కొండపైకి వాహనాల ద్వారా ప్రవేశాన్ని నిరోధించాలని ప్రభుత్వాన్ని, టీటీడీని రాజాసింగ్ కోరారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం గంభీరంగా స్పందించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.