Rains: ఏపీ ప్రజలకు వెదర్ అలర్ట్.. మూడు రోజులపాటు వర్షాలు

ఏపీ (Andhra pradesh) ప్రజలకు వెదర్ అలెర్ట్. ఓ వైపు చలితో వణికిపోతున్న ప్రజలను వర్షాలు ముంచెత్తనున్నాయి. రానున్న 3 రోజుల్లో ఏపీ (Andhra pradesh)లో వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుండి మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

Published By: HashtagU Telugu Desk
Rains

Rains

ఏపీ (Andhra pradesh) ప్రజలకు వెదర్ అలెర్ట్. ఓ వైపు చలితో వణికిపోతున్న ప్రజలను వర్షాలు ముంచెత్తనున్నాయి. రానున్న 3 రోజుల్లో ఏపీ (Andhra pradesh)లో వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుండి మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ గురువారంనాటికి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

దీని ప్రబాశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు రాష్ట్రంలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు రాష్ట్రంలో ఈ వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది.

Also Read: Three Died: హర్యానాలో విషాదం.. ముగ్గురు వలస కూలీలు సజీవ సమాధి

రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఛాన్స్ ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రేపు అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. ప్రస్తుతం అనేక పంటలు చేతికి రానున్నాయి. ఈ సమయంలో రైతులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

 

  Last Updated: 23 Dec 2022, 10:40 AM IST