కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌లో పలు కీలక విషయాలను వెల్లడించడం తో పాటు పలు కేటాయింపులు చేసారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు (Telugu states) సంబదించిన రైల్వే బడ్జెట్ (Railway Budget 2024) చూస్తే..
ప్రస్తుత బడ్జెట్ లో ఏపీ(AP)కి రూ. 9138 కోట్లు కేటాయించగా..తెలంగాణలో రైల్వే అభివృద్ధి కోసం రూ. 5071 కోట్లు కేటాయించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ (Ashwini Vaishnaw) మాట్లాడుతూ..2009 నుంచి 2014 వరకు 886 కోట్లు కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్ లో రూ. 9138 కోట్లు ఒక్క ఆంధ్రప్రదేశ్ కేటాయించినట్లు తెలిపారు. ఇది 10 శాతం రెట్టింపు అన్నారు. ఏడాదికి 240 కి.మీ ట్రాక్ పనులు జరుగుతున్నాయని , 98 శాతం ఆంధ్రప్రదేశ్‌లో విద్యుద్దీకరణ పూర్తి అయ్యిందన్నారు. ఖాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీకి పీఎం శంకుస్థాపన చేసారని , ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయన్నారు. ఇక విశాఖ రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వాన్ని అడిగితే ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు భూమి ఇస్తే అప్పుడు పనులు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జోన్ ఏర్పాటు కోసం డీపీఆర్ సిద్ధం అయ్యిందన్నారు. ఏపీ లో 97 శాతం రైల్వే ట్రాక్స్ పూర్తి చేశామని , 72 అమృత్ స్టేషన్స్ పూర్తి అయ్యాయి అని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక దేశ వ్యాప్తంగా ప్రయాణికుల సౌలభ్యం కోసం 40,000 రైల్వే బోగీలను వందే భారత్ ప్రమాణాలకు మారుస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మౌలిక సదుపాయాల కేటాయింపును రూ.11.11 లక్షల కోట్లకు పెంచినట్లు తెలిపారు. మూడు ప్రధాన రైల్వే ఎకనామిక్ కారిడార్ల అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
వీటిలో ఒకటి ఎనర్జీ, మినరల్, సిమెంట్ కారిడార్లు. రెండోది పోర్టు కనెక్టివిటీ కారిడార్లు. మూడోది అధిక ట్రాఫిక్ సాంద్రత కారిడార్లు. మల్టీ మోడల్ కనెక్టివిటీ కోసం పీఎం గతి శక్తి కింద ఈ ప్రాజెక్టులను గుర్తించారు. ఇవి లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఖర్చును తగ్గిస్తాయని ఆర్థిక మంత్రి తెలిపారు.
Read Also : Budget 2024 : బడ్జెట్ లో కొత్త ట్యాక్స్ ని ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్