Rahul Gandhi: వైఎస్ షర్మిల, సునీతా రెడ్డిలకు బెదిరింపులు రావడంపై రాహుల్ గాంధీ స్పందించారు. మహిళలను బెదిరించడం, వారిపై అసభ్యకర పోస్టులు పెట్టి ట్రోల్స్ చేయడం పిరికివాళ్ళు చేసే పని అంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ. షర్మిల, సునీతా రెడ్డిలపై బెదిరింపులను రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ నేతలు ఖండించారు. మహిళలను అవమానించడం జుగుప్సాకరమైనదని పేర్కొన్నారు. వైఎస్ షర్మిల, సునీతకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు రాహుల్.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, దివంగత కాంగ్రెస్ నేత వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి బెదిరింపులను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఖండించారు. ఇద్దరు నేతలకు బెదిరింపులు రావడం దురదృష్టకరమని రాహుల్ అభివర్ణించారు. మహిళలను అవమానించడం మరియు బెదిరించడం పిరికి చర్య అని అన్నారు. అంతకుముందు షర్మిలను పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ కొందరు ట్రోల్స్ చేశారు. అవమానకరమైన మరియు బెదిరింపు పోస్ట్‌లు పోస్ట్ చేసిన వ్యక్తిపై వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా నారెడ్డి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కూడా ఏపీసీసీ అధ్యక్షురాలిపై బెదిరింపులను ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. షర్మిల, సునీత వేధింపులకు గురవుతున్నారు. ఇది వారిని అగౌరవపరచడమే కాకుండా ప్రజా జీవితంలో సభ్యత, ఆరోగ్యకరమైన సూత్రాలకు విరుద్ధం’ అని పైలట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.