TDP: టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా రఘురామకృష్ణ రాజు

  • Written By:
  • Updated On - April 22, 2024 / 04:10 PM IST

Raghu Rama Krishnam Raju: రఘరామకృష్ణ రాజును టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా(District President of TDP)నియమించారు. అయితే ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షురాలిగా వున్న తోట సీతారామలక్ష్మిని పార్టీ పొలిట్‌ సభ్యురాలిగా నియమించడంతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నికల సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు టీడీపీలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ టిక్కెట్‌ల సర్దుబాటులో భాగంగా పార్టీ సంస్థాగత నిర్మాణంలోనూ మార్పులు చేశారు. ఎంపీ రఘురామకృష్ణ రాజుకు నరసాపురం ఎంపీ టిక్కెట్‌ ఇవ్వలేకపోవడంతో ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం ఆయనను బరిలో నిలిపింది. ఇప్పటి వరకు కొనసాగిన సస్పెన్స్‌కు ముగింపు పలికి రఘురామకు చంద్రబాబు బీ ఫారం అందించారు. ఉండిలో ఈరోజు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ స్థానాన్ని తొలుత ఎమ్మెల్యే రామరాజుకు కేటాయించారు.

Read Also: Thalaivar 171: రజినీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. తలైవర్ 171 టీజర్ వచ్చేస్తోంది

కాగా, ఏపీ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన నేతల్లో రఘురామ కృష్ణరాజు ఒకరు. ఆయన వైసీపీలో ఉన్నప్పుడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూనే వచ్చారు. అలాంటి రఘురామ ఎన్నికల ముందు వైసీపీని వీడారు. తాను మరోసారి నరసాపురం ఎంపీగా గెలుస్తానని ధీమాగా చెప్పుకొచ్చారు. అయితే టీడీపీ-బీజేపీ ఆయనకు ఎంపీ టికెట్ విషయంలో ఊహించని షాక్ ఇచ్చాయి. ఆయనకు సభ్యత్వమే లేద‌ని రెండు పార్టీలు చెప్పడంతో రఘురామ అవాక్కయ్యారు. చివరికి టీడీపీ సభ్యత్వం తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఆయన నరసాపురం ఎంపీ టికెట్ విషయంలో బాగానే పోరాడారు కానీ.. అప్పటికే ఆలస్యమైంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పి ఉండి అసెంబ్లీ స్థానాన్ని ఆయన చేతుల్లో పెట్టారు.

Read Also: Summer Fruit Salads : సమ్మర్ స్పెషల్.. రకరకాల హెల్తీ ఫ్రూట్ సలాడ్స్.. ఎలా చేయాలో తెలుసా?

ఉండి అసెంబ్లీ టికెట్ దక్కించుకున్న రఘురామకృష్ణ రాజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నుండి బీ ఫారం అందుకున్నారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ..టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేతుల మీదుగా ఉండి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా బీ ఫారం అందుకున్నాను. నన్ను ఎల్లప్పుడూ ఆదరించి, ఆశీర్వదిస్తున్న ఉండి ప్రజల వెన్నంటి నిలిచి, ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతానని ఈ సందర్భంగా ఉండి ప్రజానీకానికి మాటిస్తున్నాను” అంటూ రఘురామ ట్వీట్ చేశారు. ఏప్రిల్ 22న సోమవారం ఉదయం 10 గంటలకు పెద అమిరంలోని తన స్వగృహం నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్ వేస్తానని రఘురామ తెలిపారు.