AP Assembly Sessions : జగన్ తో రఘురామ చెప్పిన మాటలు ఇవే..

మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ తో ముచ్చటించడం అక్కడి వారినే కాదు సమావేశాలు టీవీల్లో చూస్తున్న వారికీ సైతం షాక్ కలిగించాయి

Published By: HashtagU Telugu Desk
Rrr Jagan

Rrr Jagan

ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Sessions) ప్రారంభమయ్యాయి. ఈరోజు నుండి ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ లో మొదటి రోజు వాడి వేడిగా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసారి స‌భ‌లో అన్ని శాఖ‌ల‌కు సంబంధించిన శ్వేతప‌త్రాలు విడుద‌ల చేయ‌బోతున్నారు. గ‌త 5 సంవ‌త్స‌రాల్లో ఆయా శాఖ‌ల్లో జ‌రిగిన విధ్వంసం అసెంబ్లీ సాక్షిగా ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌బోతున్నారు. కాగా అసెంబ్లీ ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఎమ్మెల్యే రఘురామ (MLA Raghurama)..మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ (Jagan) తో ముచ్చటించడం అక్కడి వారినే కాదు సమావేశాలు టీవీల్లో చూస్తున్న వారికీ సైతం షాక్ కలిగించాయి. బద్ద శత్రువైన జగన్ తో రఘురామ ముచ్చటించడం ఏంటి అని అంత మాట్లాడుకున్నారు. అసలు రఘురామ..జగన్ తో ఏమాట్లాడి ఉంటాడు..? దేని గురించి మాట్లాడి ఉంటాడు..? అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది..? ఇలా అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ మాటలకు రఘురామ క్లారిటీ ఇచ్చారు.

జగన్ అసెంబ్లీ రావాలని తను చాలా డిబేట్ లలో చెప్పానని… ఈ రోజు కలిసిన సమయంలో కూడా అదే మాట చెప్పానన్నారు. అసెంబ్లీకి మిస్ కావొద్దని.. ప్రతీ రోజు రావాలని జగన్ తో చెప్పినట్లు రఘురామ తెలిపారు. ‘యెస్.. యు విల్‌ సీ’ అని జగన్ కూడా నవ్వుకుంటూ సమాధానం ఇచ్చారన్నారు. తమ మధ్య శతృత్వం, రాజకీయ వైరం ఉన్నప్పటికీ.. అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా కలుసుకున్న సందర్భంగా ఈ విషయాలు చెప్పానన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈరోజు అసెంబ్లీ సమావేశాల విషయానికి వస్తే..

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ (Governor Abdul Nazeer) ప్రసంగించారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు ధన్యవాదాలు, కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కూటమి సర్కార్ ఫై ప్రశంసలు తెలిపారు. చంద్రబాబు విజనరీ నాయకుడు అని, 2014లో ఏపీ అభివృద్ధికి ఆయన తీవ్రంగా కృషిచేశారని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగిందన్నారు. అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయని, రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ఎంతో కృషిచేశారని కొనియాడారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని రంగాలు నష్టాలు చవిచూశాయన్నారు. చంద్రబాబు హయాంలో వచ్చిన పెట్టుబడిదారులు వెనక్కి మళ్లారని తెలిపారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిందని పేర్కొన్నారు.

విభజన చట్టం ఏపీ అభివృద్ధికి తగినంత పరిహారం ఇవ్వలేదన్న గవర్నర్‌, ఆస్తులు, అప్పుల పంపిణీలో అసమానతలు ఉన్నాయన్నారు. అశాస్త్రీయ విభజన వల్ల 46 శాతం వనరులు మాత్రమే వారసత్వంగా వచ్చాయని, రాజధాని హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల ఆర్థిక నష్టం జరిగిందని, ఉన్నత విద్యాసంస్థలు కోల్పోయామని, గవర్నర్‌, భారీ రెవెన్యూ లోటు వారసత్వంగా వచ్చిందని తెలిపారు.

Read Also : YS Jagan : ఏపీ అసెంబ్లీలో టెన్షన్.. పోలీసులు, జగన్‌ మధ్య వాగ్వాదం

  Last Updated: 22 Jul 2024, 02:09 PM IST