నర్సాపురం నుంచి ఎంపీగా మళ్లీ బరిలోకి దిగుతానని రఘురామకృష్ణరాజు తాడేపల్లి గూడెం వేదికగా ప్రకటించారు.రీసెంట్ గా వైసీపీ (YCP) కి రాజీనామా చేసిన ఎంపీ రఘురామ కృష్ణం రాజు (Raghurama Krishnamraju)..ఇప్పుడు టీడీపీ (TDP) – జనసేన (Janasena) కూటమి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు స్థానం (Narsapuram MP Seat) నుంచి వైసీపీ తరపున రఘురామకృష్ణరాజు పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. జనసేన తరపున కొణిదెల నాగబాబు, టీడీపీ తరపున వేటుకూరి వెంకట శివరామరాజు బరిలో నిలిచారు. అయితే వైసీపీ అభ్యర్థిగా రఘురామ 31,909 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ తవ్రతః వైసీపీ నేతలకు, ఆయనకు మధ్య విభేదాలు తలెత్తాయి. ఇలా ఏర్పడిన విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఆయన పార్టీకి దూరమయ్యారు. తన ఐదేళ్ల పదవీ కాలంలో 4 ఏళ్ల పాటు రెబల్‌గానే ఉన్నారు. ఇక రీసెంట్ గా వైసీపీ కి రాజీనామా చేసిన రఘురామ..ఇప్పుడు టీడీపీ నుండి బరిలోకి దిగబోతున్నాడు. ఈ విషయాన్నీ ఈరోజు తాడేపల్లిగూడెంలో జరిగిఆన్ టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో ఈ వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
సభ వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలోనే రఘురామకృష్ణ తనపై పోటీపై స్పష్టమైన ప్రకటన చేశారు. అంటే ఆయనకు ఎంపీ సీటు ఖాయమైందని తేలిపోయింది. కానీ ఏ పార్టీ నుంచి అనేది తేలాల్సి ఉంది. ఏ పార్టీలోనూ ఇంకా చేరకున్నా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం జరుగుతున్న ప్రయత్నంలో భాగమయ్యేందుకు తాడేపల్లిగూడెం సభకు వచ్చానని రఘురామ చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా సీఎం జగన్ ను ఉద్దేశించి సభా వేదికపై రఘురామ ఘాటు విమర్శలు గుప్పించారు. ఏపీని సర్వనాశనం చేసిన నాయకుడిని గద్దె దించాల్సిందేనని స్పష్టంచేశారు.
ఆ ఇద్దరి ఎదురుగానే చెబుతున్నా… మళ్ళీ నరసాపురం నుంచి… ఇదే కూటమి నుంచి పోటీచేస్తా.ఇంతకంటే పెద్ద సభ వారిద్దరితో నేను ఏర్పాటు చేస్తా రఘురామ #TDPJanasena #TeluguJanaVijayam #Jenda #Pawanakalyan #ChandrababuNaidu #AndhraPradeshElections2024 #HashtagU pic.twitter.com/E1tSREUzQG
— Hashtag U (@HashtaguIn) February 28, 2024
Read Also : Pawan Kalyan : నాతో స్నేహం అంటే చచ్చేదాక – పవన్ కళ్యాణ్