Site icon HashtagU Telugu

Raghu Rama Krishnam Raju : టీడీపీ లో చేరిన రఘురామకృష్ణరాజు

Rrr Tdp

Rrr Tdp

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghurama Krishnaraju)..టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) సమక్షంలో టీడీపీ (TDP)లో చేరారు. పాలకొల్లు సభలో చంద్రబాబు సమక్షంలో ఆయన ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. రఘురామకు పార్టీ కండువా కప్పి చంద్రబాబు ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి తరఫున ఎంపీగా పోటీ చేస్తానని చాలా రోజుల నుండి రఘురామ అంటున్నప్పటికీ ఆయనకు టికెట్ దక్కలేదు. నరసాపురం ఎంపీగా పోటీ చేయాలని చివరి వరకూ ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. అయితే, చంద్రబాబు ఆయనకు రాజ్యసభ సీటు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక పార్టీ లో చేరిన రాజు..రాష్ట్రంలో కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు చొరవతో మళ్లీ ప్రజలముందుకొచ్చానన్నారు. చంద్రబాబు, ప్రజల రుణంతీర్చుకుంటానని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక చంద్రబాబు మాట్లాడుతూ.. ”ఒక సైకో పాలనలో ప్రాణాలు ఒడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన వ్యక్తి రఘురామ. మీ అందరి ఆమోదంతో పాలకొల్లులో ఆయన్ను మనస్ఫూర్తిగా టీడీపీలోకి ఆహ్వానిస్తున్నాం. పార్టీలో చేర్చుకొంటున్నాం. ఒక ఎంపీని తన నియోజకవర్గానికి రాకుండా చేసిన దుర్మార్గుడు ఎవరు? ఇది న్యాయమా? మీకు ఆమోద యోగ్యమా? ఏంటీ అరాచకం? ఏంటీ సైకో పాలన? గతంలో ఆయన్ను పోలీసుల కస్టడీలోకి తీసుకొని ఇష్టానుసారంగా చిత్రహింసలకు గురిచేశారు. రాష్ట్రపతి, గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లి అన్నివిధాలా ప్రయత్నిస్తే.. చివరకు కోర్టు జోక్యంతో ఆయన బయటపడ్డారు.. లేదంటే ఈరోజు ఆయన్ను మీరు చూసేవాళ్లు కాదు. అందుకే దుర్మార్గుడి పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని, పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఇలాంటి వ్యక్తులు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనితెలియజేస్తూ రఘురామను మీ అందరి ఆమోదంతో పార్టీలోకి ఆహ్వానిస్తున్నా” అని పాలకొల్లు ప్రజల సమక్షంలో చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక రఘురామ టీడీపీలో చేరటంతో చాలా కాలంగా కొనసాగుతున్న సస్పెన్స్ కి తెరపడినట్లు అయ్యింది.

Read Also : Pushpa 2 : కౌంట్ డౌన్ పోస్టర్ తో పూనకాలు స్టార్ట్ చేసిన పుష్ప టీం