Raghu Rama Krishna Raju : నాకు పవన్ ..బాబు అండగా ఉన్నారు – రఘురామరాజు

ఉగాది పర్వదినాన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రఘురామ భేటీ అయ్యారు

Published By: HashtagU Telugu Desk
Rrr Pawan

Rrr Pawan

తనకు ఎవరు అండగా లేరని అనుకుంటున్నారని..కానీ నాకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , చంద్రబాబు (Chandrababu) లు అండగా ఉన్నారని తెలిపారు నరసాపురం ఎంపీ రఘురామరాజు (Raghu Rama Krishna Raju ). ఉగాది పర్వదినాన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రఘురామ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చానని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

అరాచక పాలన చేస్తున్న జగన్‌ను సాగనంపాలని పిలుపునిచ్చారు. తనకు ఎలాంటి భయం లేదని, ఇటు ప్రజాక్షేత్రంలో, అటు చట్టసభల్లో ఉంటానని స్పష్టం చేశారు. అయితే ఏ సభకు పోటీ చేయాలి అనేది త్వరలోనే తెలుస్తుందన్నారు. తన ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్‌ను రమ్మని అడిగినట్లు రఘురామకృష్ణరాజు తెలిపారు. ఇందుకు పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. తన విజయానికి సహకరించిం, ప్రచారం చేస్తానని పవన్ హామీ ఇచ్చారని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించి తీరుతారని ఆయనను ఏ శక్తి అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేసారు.

Read Also : Rajamouli: నితిన్ మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన జక్కన్న.. ఆ హిట్ మూవీ రిలీజ్?

  Last Updated: 09 Apr 2024, 06:18 PM IST